- Advertisement -
ఫేక్ కరెన్సీ కేసులో కామెరూన్ దేశస్తుడు అరెస్టు
Cameroonian citizen arrested in fake currency caseరంగారెడ్డి
హయత్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో నకిలీ కరెన్సీ పేరుతో అమాయకులను మోసం చేస్తున్న కామెరూన్ దేశస్థుడు డెవలైస్ కిట్ ను హయత్ నగర్ పోలీసులు అరెస్టు చేసారు. అసలైన నోట్లు 5 లక్షల లు ఇస్తే 10 లక్షల ఫేక్ కరెన్సీ ఇస్తాను అని రసూల్ అనే వ్యక్తిని మోసం చేయటం తో బాధితుడు పోలీసులకి పిర్యాదు చేసాడు. దాంతో రంగం లోకి దిగిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసారు. డివొలిస్ కిట్ గతంలో బెంగళూర్ లో ఫేక్ కరెన్సీ కేసులో కూడా అరెస్టు అయి జైలు కి వెళ్లి వచ్చినట్లు, ఫేక్ పాస్ పోర్ట్ తో తిరుగుతున్నట్టు గుర్తించారు.
- Advertisement -




