సింహం గుర్తుకు ఓటేసి గెలిపించాలని ప్రచారం …
మక్తల్ నవంబర్ 21 వాయిస్ టుడే ప్రతినిధి
మఖ్తల్ నియోజకవర్గంలో ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరపున అసెంబ్లీ బరిలో నిలిచిన గవినోళ్ల వెంకట్రామిరెడ్డి జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. కాచ్ వార్,
జక్లేర్, పులిమామిడి, పాతర్ చేడ్ గ్రామాల్లో ఇంటింటి ప్రచారం చేపట్టారు.. ఇంటింటికీ తిరుగుతూ… రాబోయే ఎన్నికల్లో సింహం గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఎమ్మెల్యే గా గెలిపిస్తే… రోడ్ల సమస్య, ఇతర సమస్యలు తీర్చుతామని హామీ ఇచ్చారు.
ప్రచారంలో జి.తిమ్మారెడ్డి, రఘువీర్ రెడ్డి, నరేశ్, భాను ప్రకాష్ రెడ్డి, వెంకట్ రెడ్డి, అనిల్ రెడ్డి, పి.సిద్దార్థ రెడ్డి, రాజేశ్ రెడ్డి, ఎం. రవీందర్ రెడ్డి, లక్ష్మీ కాంత్ రెడ్డి, కుమ్మరి శ్రీనివాస్
తదితరులు పాల్గొన్నారు.



