- Advertisement -
డి.టి.డి.సి కొరియర్ ద్వారా వివిధ ప్రాంతాలకు ఎండు గంజాయి అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసిన చందానగర్ పోలీసులు, మాదాపూర్ డిసిపి కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో నాదిరి లింగం, సున్నపు రాజు ఇద్దరు నిందితులు అరెస్టు చేశారు ,వీరి వద్ద నుండి టీఎస్ 16 ఎఫ్బి 9 1 8 7 నంబరు గల స్విఫ్ట్ డిజైర్ కారు, 90 కిలోల ఎండు గంజాయి, నాలుగు మొబైల్ ఫోన్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు,
గంజాయి విలువ 30 లక్షల వరకు ఉంటుందని పోలీసులు అన్నారు, నిందితుడు నాధురి లింగం పైన వివిధ పోలీస్ స్టేషన్ పరిధిలో ఐదు కేసులు ఉన్నాయి, సున్నపు రాజు మీద గతంలో ఒక కేసు ఉంది, అత్యంత విశ్వాసనీయ సమాచారం మేరకు చందానగర్ పోలీసులు బాల్ నగర్ రేంజ్ పోలీసులు సంయుక్త ఆపరేషన్ చేసి నిందితులను పట్టుకున్నారు.
- Advertisement -