
రాజేంద్ర నగర్ పీవీఎన్ఆర్ ఎక్సప్రెస్స్ వే పై రోడ్డు ప్రమాదం
ఒకదాని వెనుక మరోటి వరసగా 4 కార్లు ఢీ..కొన్నాయ్
పీవీఎన్ఆర్ పిల్లర్ నెంబర్ 139 ఎక్సప్రెస్స్ వే పై ప్రమాదం
కిలోమీటర్ మేర స్తంభించిన ట్రాఫిక్
రంగారెడ్డి: పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వే పై వరుసగా నాలుగు కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కార్లు ధ్వంసమవగా ఇద్దరికీ స్వల్ప గాయాలయ్యాయి తెల్లవారుజామున పిల్లర్ నెంబర్ 139 వద్ద చోటు చేసుకుంది. తెల్లవారుజామున శంషాబాద్ నుంచి మెహిదీపట్నం వైపు వస్తుండగా ఓ వ్యాన్ వివిఎన్ఆర్ ఎక్స్ప్రెస్వే పై పిల్లర్ నంబర్ 139 వద్ద అస్మాత్తుగా ఆగింది. వెనకాల వస్తున్న కారు దానిని తప్పించెక్రమంలో డివైడర్ను ఢీకొంది. దాని వెనకాల వచ్చిన మరో మూడు కార్లు వరుసగా దానికి ఒకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో వాహనాలు ధ్వంసం అవగా ఇద్దరికీ గాయాలయ్యాయి. కార్లు ఒకదానికొకటి వర్షాగా ఢీకొనడంతో సుమారు కిలోమీటర్ మేర వాహనాలు స్తంభించాయి. రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. వాహనాలను నియంత్రించారు. ధ్వంసమైన కారులను అక్కడి నుంచి తరలించారు.




