12.2 C
New York
Wednesday, April 24, 2024

ఒకే ఇంట్లో 60 కోట్ల విలువల కార్లు…ఐ టి రైడ్లు

- Advertisement -

ఒకే ఇల్లు.. ఓనర్ ఒకడే.. అతని ఇంటినిండా విలాసవవంతమైన కార్లే..అన్నీ లగ్జరీ బ్రాండ్ కార్లే. అందులో అత్యంత విలాసవంతమైన రోల్స్ రాయిస్, ఫాంటమ్ , లంబోర్ఘిని ఫెరారీ, మెక్లారన్ కార్లు ఉన్నాయి. వీటిలో 60 కోట్లు ఉంటుందని ఐటీ అధికారులు అంచనా వేస్తున్నారు.. విషయం ఏమిటంటే.. ఢిల్లీలోని ప్రముఖ బంషి ధర్ టుబాకో కంపెనీ యజమాని ఇంట్లో ఐటీ రైడ్స్ నిర్వహించిన అధికారులు ఈ విలాసవంతమైన కార్లను సీజ్ గుర్తించారు.

శుక్రవారం ( మార్చి 1) కాన్పూర్, ఢిల్లీ, ముంబై, గుజరాత్ లలో ఉన్న బంషిధర్ టుబాకోకంపెనీ యజమాని శివం మిశ్రా ఇళ్లపై ఐటీ అధికారులు ఒకేసారి రైడ్ చేశారు. అధికారులు తనిఖీలో సంచలన విషయాలు బయటకొచ్చాయి. ఢిల్లీలోని ఆ వ్యాపారి ఇంటి నిండా అన్నీ లగ్జరీ బ్రాండ్ కార్లే. అందులో అత్యంత విలాసవంతమైన కారు రోల్స్ రాయిస్, ఫాంటమ్ , లంబోర్ఘిని ఫెరారీ, మెక్లారన్ కార్లు ఉన్నాయి.

వీటిలో 60 కోట్లు ఉంటుందని ఐటీ అధికారులు అంచనా వేస్తున్నారు.వీటితో పాటు 4.5 కోట్ల నగదు, పలు ఆస్తులకు చెందిన పత్రాలను స్వాధీనం చేశారు. బంషీధర్ టుబాకో కంపెనీ ఖాతాలో ఫేక్ చెక్ లను జారీ చేసినట్లు గుర్తించారు ఐటీ అధికారులు

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!