లేడీ అఘోరిపై కేసు
గుంటూరు, మార్చి 24
Case against Lady Aghori
రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిన లేడీ అఘోరీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నగ్నంగా దేవాలయాలకు వెళ్తూ తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో వైరల్ గా మారింది. ఇప్పటికే పలు చోట్ల చాలా మందితో గొడవకు దిగుతూ హల్ చల్ చేసింది. పోలీసులను నోటికి ఇష్టమొచ్చినట్టు తిడుతూ వీరంగం సృష్టిస్తుంది. అయితే, తాజాగా మంగళగిరి పోలీస్ స్టేషన్ లో లేడీ అఘోరీపై కేసు నమోదైంది. శ్రీ వర్షణి అనే అమ్మాయి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ లో లేడీ అఘోరీపై ఫిర్యాదు చేశారు.అయితే, ఇటీవల వర్షిణి అనే అమ్మాయి కోసం వెళ్లిన ఈ లేడీ అఘోరీని ఓ వ్యక్తి చితకబాదిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. వర్షిణికి తాను దీక్ష ఇచ్చినట్టు అఘోరీ చెప్పిన ఆడియో కూడా సోషల్ మీడియాల లీక్ అయ్యింది. అయితే ఓ వ్యక్తి చితకబాదిన లేడీ అఘోరీ మాత్రం చూస్తూ సైలెంట్ గా ఉండడం పట్ల పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే అదే సమయంలో అఘోరీకి, వర్షిణికి మధ్య సంభాషణ జరగగా.. తను ఇప్పుడు చూడడానికి రాకపోతే చచ్చిపోతానంటూ అఘోరీని వర్షిణి బెదిరింపులకు కూడా గురిచేసింది.ఇంతకుముందే శ్రీవర్షణి అనే అమ్మాయికి తాను దీక్ష ఇస్తున్నట్లు పలుమార్లు లేడీ అఘోరీ చెప్పింది. ఆ అమ్మాయి ఇక ఎప్పటికీ తనతోనే ఉంటుందని పేర్కొంది. చాలా మంది ఆడపిల్లలు తన వద్దకు వస్తున్నారని.. ఎవరైనా సరై ఇష్టపడి శిక్షణ తీసుకోవాలంటే భగవంతునికి సేవ చేసుకోవాలని తెలిపింది. అలా అయితేనే తాను శిక్షణ ఇస్తానని చెప్పుకొచ్చింది. తనను నమ్ముకుని వచ్చిన ఆడబిడ్డలను మంచి స్థితికి తీసుకుని వెళ్తానని పేర్కొంది. ఇక తనతో పాటు ఉన్న అమ్మాయి వర్షిణిని కూడా తనలాగే మహిళల కోసం పోరాడే వ్యక్తిలా తీర్చి దిద్దుతానని లేడీ అఘోరీ చెప్పుకొచ్చింది.యువతి తనకు కాల్ చేసిందని.. తన దగ్గర దీక్ష తీసుకుంటానని చెప్పడంతో పరిచయం అయిందని లేడీ అఘోరీ పేర్కొంది. ఇక ఇలాంటి ఆడపిల్లలకు మాత్రమే శిక్షణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపింది. ఆడ పిల్లలను ఆడ పులిలా తీర్చి దిద్దడమే తన ప్రధాన లక్ష్యమని చెప్పుకొచ్చింది. అయితే, అమ్మాయి వర్షిణి మాట్లాడిన మాటలు సోషల్ మీడియా వైరల్ గా మారాయి. ‘ఇప్పటికే అఘోరీ వద్ద దీక్ష తీసుకున్నా. ఇది నా ఒక్కదాని నిర్ణయం కాదని.. మా తల్లిదండ్రులు ఒప్పుకున్నాకే నేను ఈ నిర్ణయం తీసుకున్నా. నేను ఒక బీటెక్ స్టూడెంట్‌ని. ఇక నుంచి అఘోరీ మాతే అన్నీ చూసుకుంటానని చెప్పింది. నన్ను సొంత కూతురిలా నన్ను చదివిస్తానని మాట ఇచ్చింది. ఆ నమ్మకంతోనే అఘోరీ అమ్మతో.. ఆమె బాటలోనే నడవాలని నిర్ణయం తీసుకున్నా’ అని అమ్మాయి వర్షిణి చెప్పింది.అయితే, లేడీ అఘోరీపై మంగళగిరి పోలీస్ట్ స్టేషన్‌లో శ్రీవర్షిణి తండ్రి కోటయ్య ఫిర్యాదు చేశారు. తన కూతురు శ్రీ వర్షిణిని అఘోరీ కిడ్నాప్ చేసిందంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. కొన్నిరోజులుగా శ్రీవర్షిణి.. అఘోరీ వద్దనే ఉంటోందని చెప్పారు. ‘నాకు తల్లిదండ్రులు’ వద్దు అని చెబుతోందని.. అఘోరీపై శ్రీ వర్షిణి కుటుంబ సభ్యులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు.