శ్రీ సాయి సూర్య డెవలపర్స్‌ … రియల్ ఎస్టేట్ సంస్థపై కేసు

- Advertisement -
  • సూపర్ స్టార్ మహేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్‌

    case-against-shree-sai-surya-developers-a-real-estate-firm
    case-against-shree-sai-surya-developers-a-real-estate-firm

హైదరాబాద్ :జులై 12:  సూపర్ స్టార్ మహేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న రియల్ ఎస్టేట్ సంస్థపై బుధవారం  కేసు నమోదు అయ్యింది. శ్రీ సాయి సూర్య డెవలపర్స్‌ అనే రియల్ ఎస్టేట్ సంస్థకు మహేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు. అయితే ఆ సంస్థ ప్లాట్స్ పేరుతో డబ్బులు కట్టించుకుని ఎగ్గొట్టింది. దీంతో బాధితులంతా పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు మధురానగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రకటనలు చూసి మోసపోయామని తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. సాయి సూర్య డెవలపర్‌ సంస్థ అధినేత సతీష్ చంద్ర గుప్తాపై చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు. 30 మంది బాధితులు సాయి సూర్య డెవలపర్స్‌పై ఫిర్యాదు చేశారు. వీరి ఫిర్యాదు మేరకు సాయి సూర్య డెవలపర్స్‌పై సెక్షన్‌ 406, 420 కింద పోలీసులు కేసు నమోదు చేశారు…

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular