- Advertisement -
కేసులను త్వరితగతిన విచారించి తీర్పులు వెలువరించాలి
Cases should be tried and adjudicated expeditiously
నాణ్యత లోపించకుండా చూడాలి
ఏలూరు
ఏపీ హైకోర్టు న్యాయమూర్తి, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి జస్టిస్ సురేష్ రెడ్డి శనివారం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని న్యాయమూర్తులతో ఏలూరు జిల్లా కోర్టు ప్రాంగణము లో జ్యూడిషల్ సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో అడ్మినిస్ట్రేటివ్ జడ్జి జస్టిస్ సురేష్ రెడ్డి మాట్లాడుతూ న్యాయమూర్తులు కేసులను త్వరితగతిన విచారించి తీర్పులు వెలువరించాలని ,ఈ క్రమంలో తీర్పులలో నాణ్యత లోపించకూడదని అలాగే సుప్రీంకోర్టు వారు సివిల్ కేసులు మరియు విచారణలో ఉన్న ఖైదీల కేసులను త్వరితగతిన తీర్పులను వెలువరించడానికి ప్రయత్నించాల్సిందిగా సూచించారని, ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని అన్నారు.
జిల్లా ప్రధాన న్యాయమూర్తి (ఎఫ్.ఎ.సి) ఎం. సునీల్ కుమార్ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని కోర్టులలో ఉన్న పెండింగ్ కేసులు వివరాలు, భవన సముదాయాల పరిస్థితులపైన వివరించారు. ఈ సమావేశంలో జిల్లాలోని ఇతర జిల్లా న్యాయమూర్తులు, సీనియర్ సివిల్ జడ్జిలు, జూనియర్ సివిల్ జడ్జిలు పాల్గొన్నారు.
- Advertisement -