కబ్జాకోరుల పై ఉక్కుపాదం మోపండి
Cast iron feet on the usurpers
మీవెంట మేం ఉంటాం
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్
రాజన్న సిరిసిల్ల
ప్రభుత్వ భవనాలు మంచి పనులు చేయాలంటే సర్కార్ భూములే లేకుండా చేశారు
జిల్లాకు నవోదయ స్కూల్ మంజూరు కాబోతోంది.
వేములవాడ ను ప్రసాద్ స్కీం కింద చేర్చబోతున్నాం
ఈ ప్రాంత అభివ్రుద్ధి కోసం అవసరమైన నిధులను కేంద్రం నుండి తెచ్చేందుకు యత్నిస్తా
గతంలో నన్ను ఏ కార్యక్రమాలకు పిలవలేదు,
ఎప్పుడైనా పిలిస్తే ఆ అధికారిపై బదిలీ వేటు వేసే వాళ్లు
ఇప్పుడైనా ప్రజల కోసం కలిసి పనిచేద్దాం అభివ్రుద్ధి సాధిద్దాం.
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్:
సిరిసిల్ల కలెక్టరేట్ లో దివ్యాంగులకు కేంద్ర మంత్రి చేతుల మీదుగా ఉపకరణాల పంపిణీ
సహకరిస్తున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కు విప్ ఆది శ్రీనివాస్ ధన్యవాదాలు.
గత పాలకులు ప్రశ్నించే గొంతులను నొక్కారని ఆవేదన
మధ్యతరగతి వ్యక్తులకు అధికారమొస్తే, పేద మధ్య తరగతి ప్రజలకు మేలు
బండి సంజయ్, నేను, పొన్నం ఆ వర్గానికి చెందిన వాళ్లమే
రాజన్న ఆలయానికి ప్రసాదం స్కీం కింద ఏటా 50 కోట్లు ఇఫ్పించండి.
సీఎస్సార్ నిధులతో అభివ్రుద్ధికి సహకరించండి
నవోదయ ఇప్పించండి
కలిసి అభివ్రుద్ధి చేసేందుకు మేం సిద్ధమన్న ఆది శ్రీనివాస్.
అవకాశముంటే మిడ్ మానేరు నుండి విజయవాడ కు సీ ప్లేన్ మంజూరు చేయించాలని సంజయ్ కు ఆది వినతి
అధికారం ఉంటేనే కలెక్టరేట్ కు వస్తాం. లేకుంటే కలెక్టర్ ను వేధిస్తామని చెప్పే వాళ్లకు బుద్ది చెబుతాం
ఆక్రమించిన స్థలంలో పార్టీ ఆఫీస్ పెడితే చర్యలు తీసుకుంటే తప్పేంటి?
దివ్యాంగుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామన్న మానకొండూరు ఎమ్మెల్యే సత్యనారాయణ.
రాష్ట్ర ప్రభుత్వాన్ని, జిల్లా కలెక్టర్ ను మళ్లీ కోరుతున్నా పేదల భూములను కబ్జాలు చేసినోళ్లను, ప్రభుత్వ స్థలాలను ఆక్రమించనోళ్ల పై ఉక్కుపాదం మోపండి. మీ వెంట నాతోసహా వేల మంది అండగా ఉంటారు. ఈ విషయంలో మీరు ముందుకు పోవాలని కోరుతున్నా. అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ రాష్ట్ర యంత్రాంగాన్ని కోరారు. రాష్ట్రంలో ప్రభుత్వ భవనాలు నిర్మించాలంటే, మంచి పనులు చేయాలంటే ప్రభుత్వ స్థలాలు లేకుండా పోయాయని, గత బీఆర్ఎస్ పాలకులు, కేసీఆర్ కుటుంబం ధరణి పేరుతో ప్రభుత్వ భూములన్నీ ప్రైవేట్ చేశారని మండిపడ్డారు. అట్లాంటి వారిని ఉపేక్షించొద్దని, బుల్డోజర్లు దించాలని కోరారు.
సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన దివ్యాంగులకు ఉప కరణాల పంపిణీ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బండి సంజయ్ తోపాటు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, కలెక్టర్ సందీప్ కుమార్ ఝూ, గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ నాగుల సత్యనారాయణ, స్థానిక మున్సిపల్ ఛైర్మన్, మార్కెట్ కమిటీ ఛైర్మన్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బండి సంజయ్ ఏమన్నారంటే.
సమాజంలో అన్ని అవయవాలు ఉన్న మనమే అనేక సమస్యలకు సతమతమవుతున్నాం. ఇగ దివ్యాంగుల ఇబ్బందులు వర్ణణాతీతం. కానీ దివ్యాంగుల మనో నిబ్బరం, ధైర్యం గ్రేట్. మీకు మేం చేయాల్సిందల్లా అండగా ఉండటమే. నీతి నిజాయితీ ఉన్నోళ్లు వారు.
కేంద్ర ప్రభుత్వం రాష్ట్రీయ వయోశ్రీ యోజన ఆర్.వి వై, పథకాల కింద ఈరోజు 69 లక్షల 54 వేల 911 రూపాయల విలువైన 675 పరికరాలను ఈరోజు 322 మంది దివ్యాంగులకు అందించడం చాలా సంతోషంగా ఉంది.
వీటిలో 87 బ్యాటరీ ఆపరేటెడ్ ట్రైసైకిల్స్, 85 సాధారణ ట్రైసైకిల్స్, 126 బిటిఇ, హెయిరింగ్ ఎయిడ్స్, 80 వీల్ చైర్స్, 127 వాకింగ్ స్టిక్స్ తోపాటు వివిధ సహాయక కిట్లు, సీపీ కుర్చీలు, ఇతర ప్రత్యేక పరికరాలు కూడా పంపిణీ చేస్తున్నం.
రెండేళ్ల క్రితం ఈ జిల్లాలోనే 1930 మంది దివ్యాంగులకు 2 కోట్ల 33 లక్షల 47 వేల 768 రూపాయల సమసవిలువైన పరికరాలను పంపిణీ చేసిన విషయం నాకింకా గుర్తుంది. అట్లాగే కరీంనగర్ జిల్లాలో కూడా గతేడాది పెద్ద క్యాంపు నిర్వహించి 750 మందికిపైగా కోట్ల రూపాయల ఖర్చు చేసి పరికరాలు అందించినం.
కేవలం నాలుగేళ్లలోనే నా పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో దివ్యాంగులు, మహిళలు, వ్రుద్దుల సంక్షేమం కోసం 100 కోట్లకుపైగా నిధులు ఖర్చు చేసినం. దివ్యాంగుల, వ్రుద్దుల ఆశ్రమాలకు కేంద్రం పెద్ద ఎత్తున నిదులు మంజూరు చేస్తోంది.
రాబోయే రోజుల్లో రాజకీయాలకు అతీతంగా కలిసి ముందుకు పోవాలని భావిస్తున్నా. దారి తప్పుతున్నోళ్లను దారికి తెచ్చేందుకు యత్నిస్తా. నేను 5 ఏళ్లలో ఎన్నడూ కలెక్టరేట్ కు రాలేదు. ఏ కార్యక్రమంలో పాల్గొనలేదు. ఎందుకంటే గతంలో నన్ను ఏ కార్యక్రమానికి పిలవలేదు. కలెక్టరేట్ కు వెళితే.. వెంటనే బాధ్యులను బదిలీ చేసే వాళ్లు. అందుకే గతంలో ఒక ఎమ్మెల్యే కలిసి ప్రోగ్రాం పెడతామంటే… మ్యూజిక్ ప్రోగాం పెడదామా? అని వ్యంగ్యస్ర్తాలు విసిరా.
ఇప్పుడు ఆ పార్టీ నేతలు కలెక్టర్ ను దూషిస్తున్నరు అధికారులను పట్టుకుని తిడుతున్నరు. అటెండర్ నుండి కలెక్టర్ కావాలంటే కష్టపడి చదివి రావాలి
కలెక్టర్ ఎమ్మెల్యే లారా బీఆర్ఎస్ ప్రభుత్వం కబ్జా చేసిన స్థలాలు, భవనాలన్నీ స్వాధీన పర్చుకోండి. గతంలో ఎకరాలకు ఎకరాలు కబ్జాలు చేసి దోచుకుంటామంటూ చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేం. పొట్టొడిని పొడుగోడు కొడితే, పొడుగోడిని పోచమ్మ కొడతదనే సంగతి గుర్తుంచుకోవాలి.
నేను మళ్లీ కోరుతున్నా పేదల భూములను కబ్జాలు చేసిటోళ్లను, ప్రభుత్వ స్థలాలను ఆక్రమించనోళ్ల పై ఉక్కుపాదం మోపండి. మీ వెంట వేల మంది అండగా ఉంటారు. ఎందుకంటే ప్రభుత్వ భవనాలకు, మంచి పనులు చేయాలంటే ప్రభుత్వ స్థలాలు లేకుండా చేశారు. ధరణి పేరుతో భూములన్నీ దోచుకున్నరు. ఒక కుటుంబమే ఎక్కువగా లాభపడ్డది. ప్రభుత్వ భూములన్నీ ప్రైవేట్ పరం చేశారు. ఇకపై అట్లా జరగడానికి వీల్లేదు. సిరిసిల్ల జిల్లాలో నవోదయ స్కూల్ త్వరలో మంజూరు కాబోతోంది. ఆ మేరకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపినం. గతంలో ప్రసాద్ స్కీం కింద నిధులిస్తాం ప్రతిపాదనలు పంపాలని కోరితే నాటి ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ ప్రభుత్వం మేం ప్రతిపాదనలు పంపిన వెంటనే పంపారు. అతి త్వరలోనే వేములవాడ రాజన్న ఆలయాన్ని ప్రసాద్ స్కీంలో చేర్చుతాం.
నేను ఎంపీగా, కేంద్ర మంత్రిగా గెలిచానంటే మీరు పెట్టిన భిక్షే. మీరు గెలిపిస్తేనే ఈ స్థాయికి వచ్చిన కలిసి పనిచేస్తా. కేంద్రం నుండి అవసరమైన నిధులన్నీ తెచ్చి ఈ ప్రాంతాన్ని అభివ్రుద్ధి చేసేందుకు యత్నిస్తా.
నా లక్ష్యం ఒక్కటే నా పార్లమెంట్ నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్క దివ్యాంగుడికి పరికరాలివ్వాలి. వాళ్లను అన్ని విధాలా ఆదుకోవాలి. మనసులో వారికి ఏ బెంగ లేకుండా రోజువారీ జీవితం గడిచేలా చేయాలన్నదే నా సంకల్పం. అందుకే నా పార్లమెంట్ పరిధిలో పరికరాలు అందకుండా ఇంకా ఎవరైనా దివ్యాంగులు మిగిలి ఉంటే వాళ్ల జాబితా కూడా రడీ చేయండి. వాళ్లందరికీ పరికరాలు అందించే ఏర్పాట్లు చేద్దాం. ఈ జిల్లాలో ఇకపై ఏ ఒక్క దివ్యాంగుడి నోటి నుండి నాకు పరికరం అందలేదనే మాట రావొద్దు