మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించిన కుల వృత్తుల మేళా.. పాల్గొన్న మున్నూరుకాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి
హైదరాబాద్, జూలై 16 : వాయిస్ టుడే
Caste professions fair inaugurated by Minister Ponnam Prabhakar
ఆషాఢ మాస బోనాల ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్‌లోని హెచ్‌ఎండీఏ (HMDA) గ్రౌండ్స్‌లో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కుల వృత్తుల మేళాను రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఘనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ప్రభుత్వం సంప్రదాయ కుల వృత్తులకు ప్రోత్సాహం అందిస్తూ, కళాకారులు, చేతివృత్తుల నిపుణులు తమ ఉత్పత్తులను ప్రజలకు పరిచయం చేసుకునేలా ఈ మేళాను నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. సంప్రదాయ వృత్తులను పరిరక్షించడం, వారికి ఆర్థికంగా చేయూతనివ్వడం ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యేలు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, ఈర్లపల్లి శంకర్, తెలంగాణ రాష్ట్ర మున్నూరుకాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, వివిధ కుల వృత్తుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
బోనాల ఉత్సవాల నేపథ్యంలో నిర్వహిస్తున్న ఈ కుల వృత్తుల మేళా సంప్రదాయ కళలు, చేతివృత్తులకు కొత్త ఊతమివ్వడంతో పాటు తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని ప్రజలకు చేరువ చేస్తుందని నిర్వాహకులు తెలిపారు.




