ఎస్సీల సమగ్రాభివృద్ధికే వర్గీకరణ తీర్పు
కాంగ్రెస్ జిల్లా నాయకులు డాక్టర్ కోటా రాంబాబు
వర్గీకరణ ఉద్యమనేత మందకృష్ణ మాదిగ అన్నకు, సుప్రీం తీర్పును వెంటనే స్వాగతించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు
తెలంగాణలో మాదిగలకు దామాషా ప్రకారం 11.2శాతం రిజర్వేషన్లను అమలుచేయాలి
ఖమ్మం,
Categorical judgment for holistic development of SCs
ఎస్సీ లోని 59 కులాల సమగ్రాభివృద్ధికే సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ తీర్పు ఇచ్చిందని, ఇది ఇది చారిత్రాత్మకమైనదని కాంగ్రెస్ జిల్లా నాయకులు డాక్టర్ కోటా రాంబాబు అన్నారు. ఖమ్మం ప్రెస్ క్లబ్లో మాదిగ రిజర్వేషన్ ఉద్యమ నేతలతో కలిసి ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ కోటా రాంబాబు మాట్లాడుతూ… 1994, జూలై 7న మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామంలో ప్రారంభించిన ఎస్సీ వర్గీకరణ పోరాటానికి కాంగ్రెస్ పార్టీ నాటి నుండి నేటి వరకు సపోర్ట్ చేస్తూనే ఉందన్నారు. మాదిగల 30 ఏండ్ల సుదీర్ఘ పోరాటంలో సుప్రీంకోర్టు తీర్పు చారిత్రాత్మకమైనదన్నారు. తెలంగాణలో జనాభా దామాషా ప్రకారం మాదిగలకు 11.2 శాతం రిజర్వేషన్లను అమలు చేయాలన్నారు. ఎస్సీ వర్గీకరణ కొరకు పోరాడిన మాదిగ అమర వీరులకు, మాదిగలకు, మద్దతు పలికిన కేంద్ర ప్రభుత్వానికి, తీర్పు వెలువడిన వెంటనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతిస్తూ విడుదలయ్యే ఉద్యోగ నోటిఫికేషన్ లో ఎస్సీ వర్గీకరణను అమలు చేసి తీరుతామని ప్రకటించినందుకు వారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో మాదిగ హక్కుల దండోరా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కొర్రిపల్లి శ్రీనివాస్ మాదిగ, ఖమ్మం జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షులు బొడ్డు బొందయ్య, టీఎస్ ఎంఆర్పిఎస్ జాతీయ నాయకులు ఎల్ వెంకటేశ్వరరావు నాయకులు, ముత్తయ్య, రంజిత్ తదితరులు పాల్గొన్నారు