కేసీఆర్ పై సీబీఐ
హైదరాబాద్, ఫిబ్రవరి 5
భారత రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు, ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతిపై ఎట్టకేలకు ప్రజాప్రయోజన వ్యాజ్యం హైకోర్టులో దాఖలైంది. మేడిగడ్డ కుంగుబాటుపై సీబీఐ విచారణ జరిపించాలని కాంగ్రెస్ నాయకుడు నిరంజన్‌రెడ్డి పిల్ వేశారు. అయితే ఇప్పటికే వివరాలు సమర్పించాలని ప్రభుత్వం గత ప్రభుత్వాన్నే ఆదేశించింది. అయితే కొంత మసయం కావాలని అడ్వకేట్ జనరల్ కోరారు. ఇంతలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. కొత్త కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. తాజాగా మేడి గడ్డ కుంగుబాటుపై మరోమారు హైకోర్టు విచారణ జరిపింది. నివేదిక ఏమైందని ప్రభుత్వాన్ని అడిగింది. ఏం చేద్దామని ప్రశ్నించింది. మళ్లీ రెండు వారాల గడువు ఇచ్చింది. మరోవైపు విచారణకు తాము సిద్ధమని ఇప్పటికే సీబీఐ హైకోర్టుకు తెలిపింది.ఇప్పుడు అందరి దృష్టి కాంగ్రెస్ సర్కార్‌పై పడింది. ఇప్పటికే విజిలెన్స్ విచారణ చేపించిన సీఎం రేవంత్‌రెడ్డి ప్రాథమిక నివేదిక ఇవ్వాలని కోరింది. ఈమేరకు విజిలెన్స్ నివేదిక సిద్ధం చేస్తోంది. అసెంబ్లీ సమావేశాల్లోగా ఈ నివేదిక ప్రభుత్వానికి అందించే అవకాశం ఉంది. ఇందులో మేడిగడ్డలోనే రూ.3,200 కోట్ల అవినీతి జరిగినట్లు సమాచారం. ఈ క్రమంలో కోర్టు నివేదిక కావాలని కోరడంతో ఇప్పుడ రాష్ట్ర ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందన్న ఆసక్తి నెలకొంది. సీబీఐ విచారణకు ఓకే చెబుతుందా.. లేక కేసీఆర్‌తో లాలూచీ పడి వెనుకడుగు వేస్తుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం అంగీకరిస్తే సీబీఐ రంగంలోకి దిగుతుంది.
కేసీఆర్ పై సీబీఐ
- Advertisement -
- Advertisement -