Thursday, March 26, 2026

ఓయోలో సీసీ కెమెరాలు…. తస్మాత్ జాగ్రత్త

- Advertisement -

ఓయోలో సీసీ కెమెరాలు…. తస్మాత్ జాగ్రత్త

CCTV cameras in Oyo.... Beware of Tasmat

శంషాబాద్లోనీ సిటా గ్రాండ్ ఓయో హోటల్ గదిలో సీక్రెట్ సీసీ కెమెరా ఏర్పాటు చేసిన హోటల్ నిర్వాహకుడు ఒంగోలు వాసి గణేష్. బెడ్ రూంలోని బల్బ్ లలో సీక్రెట్ కెమెరాలు పెట్టిన నిర్వాహకుడు. రూమ్ అద్దెకు తీసుకున్న వ్యక్తుల అశ్లీల చిత్రాలను చిత్రీకరించి, బాధితులను బెదిరిస్తున్న ఓయో హోటల్ నిర్వాహకుడు. హోటల్ నిర్వాకుడు ఒంగోలు వాసి గణేష్ గా గుర్తింపు. పోలీసులకు ఫిర్యాదు చేసిన ఓ జంట…. తనిఖీలు చేసి నిందితుని అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఈ విషయాన్ని పోలీసులు చాలా సీరియస్ గా తీసుకుని నిందితుడు నీ అదుపులోకి తీసుకున్నారు….. అలానే అతడి వద్ద ఉన్న రెండు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వివరాల ప్రకారం ఓయో కి వచ్చిన వారి వీడియోస్ చిత్రీకరించి వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసి అడిగినంత డబ్బును ఏదో ఒకరకంగా మూటగట్టుకుందం అని ప్లాన్ వేసాడు ఓ కేటుగాడు. వచ్చిన ప్రతి ఒక్కరి వీడియోస్ చిత్రీకరించి వాళ్ళకి సొంత వీడియోస్ నీ చూపించి డబ్బులు అడ్డదారిలో సంపాదిస్తున్నాడు గణేష్ అనే వ్యక్తి. ఏదో సరదాగా ఏకాంతంగా ఉండాలి అని , ప్రైవసీ గా ఉంటుంది అని గడపడానికి వస్తుంటారు ప్రేమ జంటలు. అలాంటి వారి సీక్రెట్స్ నీ రికార్డు చేయడం దారుణమైన సంఘటన అని మనం అనుకోవచ్చు. వాళ్ళు చేసే రొమాన్స్, అశ్లీల చిత్రాలను తీసి బ్లాక్ మెయిల్ చేయడం తో భయబ్రాంతులకు గురి అవుతున్నారు.ఈ సంఘటన మళ్ళీ పునరావృతం కాకుండా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు కోరారు. దీని వలన ఓయోకి వెళ్ళాలి అంటేనే భయం వేస్తుంది అని పలువురు ప్రేమ జంటలు భయపడుతున్నారు. మొత్తానికి బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్