- Advertisement -
అంగన్వాడీ టీచర్ అంత్యక్రియలకు 20వేలు అందించిన సీ డి పీ ఓ
CDPO donated 20 thousand for Anganwadi teacher's funeral
నర్సంపేట
నర్సంపేట ప్రాజెక్టు నల్లబెల్లి మండల పరిధిలోని రేలకుంట -2 అంగన్వాడి టీచర్ నిర్మల అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మరణించడంతో ఆమె అంత్యక్రియలకు సీ డి పీ ఓ మధురిమ 20వేల చెక్కును అందించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.ఈ సందర్భంగా సి డి పి ఓ మాట్లాడుతూ, నిర్మల అంగన్వాడీ టీచర్ గా సేవలందిస్తూ అనారోగ్య సమస్యలతో మరణించడం చాలా బాధాకరమని అన్నారు. అంగన్వాడీ టీచర్ గా ఆమె అందించిన సేవలు మరువలేనివని,ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో యు డి సీ రెహమాన్, సూపర్వైజర్స్ అరుణ, ఝాన్సీ రాణి, అంగన్వాడి యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు నల్ల భారతి, అంగన్వాడీ టీచర్స్ సునీత, సుజాత, స్వరూప, శ్రీలక్ష్మి పాల్గొన్నారు.
- Advertisement -