ఘనంగా ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ వేడుకలు.
Celebrating World Diversity Day
విభిన్న ప్రతిభావంతుల (దివ్యాంగులు) పట్ల స్నేహ, సమభావముతో మెలగాలి
-మండల విద్యాధికారి సుదర్శన్ రెడ్డి.
నందవరం:
)సమాజంలో ప్రజలందరూ విభిన్న ప్రతిభావంతుల (దివ్యాంగులు) పట్ల చిన్న చూపు, అవహేళన చేయకుండా వారితో స్నేహపూర్వకంగా సమభావముతో మెలగాలని మండల విద్యాశాఖ అధికారి సుదర్శన్ రెడ్డి తెలిపారు. మంగళవారం మండల కేంద్రమైన నందవరం స్పెషల్ ప్రాథమిక పాఠశాలలో విభిన్న ప్రతిభావంతుల పాఠశాల( నాన్ భవిత కేంద్రం ) ఉపాధ్యాయులు వెంకటసుబ్బయ్య అధ్యక్షతన ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ దివ్యాంగులకు అవయవ లోపాలు వారికి భగవంతుడిచ్చిన గొప్ప వరమన్నారు. ప్రభుత్వం దివ్యాంగులకు ప్రత్యేక రాయితీలు, శిక్షణ, ప్రత్యేక సౌకర్యాలు నేటికీ అమలుపరుస్తూ వారికి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తుందని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వం అందించే సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు . ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం ను పురస్కరించుకొని విద్యార్థిని, విద్యార్థులకు వివిధ రకాల ప్రతిభాపాటవాల పోటీలను నిర్వహించి గెలుపొందిన వారికి మరియు మిగతా పిల్లలందరికీ కూడా మండల విద్యాధికారి సుదర్శన్ రెడ్డి, స్పెషల్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు దుబ్బన్న ల చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. విభిన్న ప్రతిభావంతుల తల్లిదండ్రులు తమ పిల్లలను మిగతా పిల్లలతో పాటు సమానంగా చూస్తూ , వికలత్వం అనేది భగవంతుడిచ్చిన గొప్ప వరంగా భావించి వారిలో ఎల్లప్పుడూ సంతోషాన్ని ఉండే విధంగా చూసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి సుదర్శన్ రెడ్డి, స్పెషల్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు దుబ్బన్న, సిఆర్ఎంటి ఉరుకుందు, దివ్యాంగుల పాఠశాల (నాన్ భవిత కేంద్రం) ఉపాధ్యాయులు వెంకటసుబ్బయ్య, ప్రశాంత్ కుమార్, విద్యార్థినీ విద్యార్థులు, తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.