అమెరికా భక్తుల సెల్ ఫోన్ చోరీ
గంటలో రికవరి చేసిన యాదాద్రి ఎస్పిఎఫ్ పోలీసులు
యాదాద్రి
Cell phone theft of American devotees
యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దర్శనానికి అమెరికా చెందిన భక్తులు కుటుంబ సభ్యులతో కలిసి యాదాద్రి కొండపైకి వచ్చారు. స్వామివారి దర్శనానికి వెళ్లడానికి ఆలయ పరిసరాల్లో సెల్ ఫోన్ పక్కన పెట్టి నిలబడ్డారు భక్తులు వెంటనే తమ సెల్ ఫోను చోరీకి గురైందని కొండపైన విధులు నిర్వహిస్తున్న ఎస్పీఎఫ్ సిబ్బందికి ఫిర్యాదు చేశారు. సిబ్బంది సీసీ కెమెరాలు సెల్ ఫోన్ లొకేషన్ ఆధారంగా కొండ కింద బస్ స్టాప్ వద్ద హైదరాబాద్ కు చెందిన భక్తులు సెల్ ఫోన్ తో వెళ్తుండగా వెంటనే దొంగను అదుపులోకి తీసుకొని యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్ కు తరలించారు. అమెరికా చెందిన భక్తులు తమ డేటా మొత్తం సెల్ ఫోన్ లోనే ఉంది సెల్ ఫోన్ చోరీ జరిగిన గంటలోపే తమ సెల్ ఫోను అందజేసిన ఎస్పీఎఫ్ సిబ్బందికి భక్తులు కృతజ్ఞతలు తెలిపారు..



