- Advertisement -
న్యూ ఢిల్లీ :సెప్టెంబర్ 19: దాదాపు రెండున్నర దశాబ్ధాలకు పైగా డిమాండ్‌లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లుకు నరేంద్రమోడీ కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. సోమవారం సాయంత్రం భేటీ అయిన కేంద్ర కేబినెట్ ఈ బిల్లుకు ఆమోదం తెలిపింది. ప్రధాని మోడీ అధ్యక్షతన గంటన్నరకు పైగా జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ బిల్లును మంగళవారం ఉదయం ప్రారంభమయ్యే పార్లమెంట్ ప్రత్యేక సమావేశంలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. కాగా, మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పించాలని మూడు దశాబ్ధాల క్రితం నుంచే ఉద్యమం నడుస్తోంది.
- Advertisement -


