పెద్దపెల్లి జిల్లా: అక్టోబర్ (వాయిస్ టుడే) గోదావరిఖని ఎన్ టి పి సి లో నూతనంగా ఏర్పాటు చేసిన గౌతమి రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ కార్యాలయం లో ట్రస్ట్ నిర్వాహకురాలు సోమారపు లావణ్య అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో మగ్గం మరియు టైలరింగ్ లో శిక్షణ పొందిన మహిళలకి సర్టిఫికెట్స్ ఇవ్వడం జరిగింది ఈసందర్బంగా ఆమె మాట్లాడుతూ .. మహిళ ఉన్నతే ధ్యేయం గా ఈ ట్రస్ట్ 10 సంవత్సరాలనుండి నడిపిస్తున్నామని ఎంతో మందికి వివిధ శిక్షణ అందించామని ఈరోజు మగ్గం,టైలరింగ్ లో శిక్షణ పొందిన 20 మంది మహిళల కు సర్టిఫికెట్స్ అందిచామని వారి ఎదుగుదలకి ఎల్లప్పుడూ సహకరిస్తామని ఇక ముందు కూడ ఇతర నూతన శిక్షణ తరగతులు ప్రారంబించి మహిళ అభ్యున్నతికి తోడ్పతామని పేర్కొన్నారు శిక్షణ సర్టిఫికెట్స్ పొందిన వారికి శుభాకాంక్షలు తెలియచేసారు . ఈకార్యక్రమం లో ట్రస్ట్ ట్రైనర్ మహిళ లు తదితరులు పాల్గొన్నారు.



