- Advertisement -
డిప్యూటీ సీఎంతో రైతు కమిషన్ చైర్మన్ సమావేశం
Chairman of Rythu Commission meeting with Deputy CM
ధరణి సమస్యలు, కొత్త రెవెన్యూ రికవరీ చట్టంపై చర్చ
రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి శనివారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు తో సమావేశం అయ్యారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో జరిగిన సమావేశంలో రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి తో పాటు భూమి సునీల్, రామగుండం ఎమ్మెల్యే రాజ్ సింగ్ ఠాకూర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ధరణి సమస్యలు, ప్రతిపాదన దశలో ఉన్న కొత్త రెవెను
రికవరీ చట్టం గురించి కోదండ రెడ్డి డిప్యూటీ సీఎంకు వివరించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో భూసంస్కరణ చట్టం, అర్బన్ ల్యాండ్ సీలింగ్ చట్టం, ధరణిలోని పార్ట్-a, పార్ట్-b లోని భూముల వివరాల గురించి చర్చించారు
- Advertisement -