Friday, October 18, 2024

ఛలో మైదాన్ .. క్రీడా అవగాహన సదస్సు

- Advertisement -

చిత్రపటానికి నివాళులర్పిస్తున్న కలెక్టర్, మాట్లాడుతున్న కలెక్టర్ గోపి

ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తుంది:  జిల్లా కలెక్టర్ డాక్టర్ బి. గోపి

chalo-maidan-sports-awareness-conference
chalo-maidan-sports-awareness-conference

కరీంనగర్ ఆగష్టు 29 (వాయిస్ టుడే ) రాష్ట్రంలో క్రీడలకు మంచి సౌకర్యాలు ఉన్నాయని, పిల్లలకు చిన్నతనం నుంచే వారి తల్లిదండ్రులు చదువుతో పాటు క్రీడల్లో చురుకుగా పాల్గొనేలా ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బి.గోపి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్టేడియంలో భారత హాకీ దిగ్గజం మేజర్ ద్యాన్ చంద్ జయంతి పురస్కరించుకొని జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఛలో మైదాన్ పేరిట క్రీడా అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన కలెక్టర్, మొదటగా భారత హాకీ క్రీడాకారుడు మేజర్ ధ్యాన్ చంద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ గోపి మాట్లాడుతూ..తెలంగాణ ప్రాంతం ప్రపంచ స్థాయిలో హాకీ క్రీడలో మంచి స్థానంలో ఉందని, తెలుగు ప్రాంతాల నుంచి ప్రపంచ స్థాయి క్రీడల్లో పాల్గొని పథకాలు సాధించిన సానీయా మీర్జా, పీవీ సింధు, నిఖత్ జరీన్, సైనా నెహ్వాల్, జావలిన్ ప్రపంచ ఛాంపియన్ నీరజ్ చోప్రా లాంటి ఎంతో క్రీడాకారులు ఉన్నారని అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులకు మెరుగైన వసతులతో పాటు సౌకర్యాలు కల్పిస్తుందని, దీంతో క్రీడాకారులు గొప్పగా రాణిస్తున్నారన్నారు. కరీంనగర్ జిల్లాలో అత్యుత్తమ క్రీడాకారులను తీర్చిదిద్దడానికి మానేరు డ్యాం వద్ద ప్రాంతీయ క్రీడా పాఠశాలతో పాటు అంబేడ్కర్ స్టేడియం లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. భవిష్యత్తులో క్రీడల్లో ఉన్నత స్థానాలను అధిరోహించడానికి కష్టపడి పని చేయాలని పిలుపునిచ్చారు. మేయర్ సునీల్ రావు మాట్లాడుతూ..జిల్లాలో క్రీడాకారులకు సదవకాశాలను కల్పించడం జరుగుతుందని తెలిపారు. సీపీ సుబ్బారాయుడు మాట్లాడుతూ.. ద్యాన్ చంద్ స్పూర్తిగా క్రీడల్లో ప్రతిభను కనబర్చాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లాలోని వెటరన్ క్రీడాకారులు సైక్లిస్ట్ లు మార్కెటెంగ్ అధికారి పద్మావతి, డాక్టర్ ఉషా ఖండాల, డాక్టర్ అజయ్ ఖండాల, స్విమ్మర్, సైక్లిస్ట్ చల్మడ వెంకటేశ్వర రావు, ఎస్ఆర్ శేఖర్ లను వెటరన్ మారథాన్ క్రీడాకారులు పూసాల మహేష్, యోగా కోచ్ కిష్టయ్య, జిమ్మాస్టిక్ కోచ్ గణేష్, స్మిమ్మింగ్ కోచ్ కె. చంద్రశేఖర్ లను శాలువా, మెమెంటో లతో సత్కరించి 100 మీటర్ల అథ్లెటిక్, 50 మీటర్ల స్మిమ్మింగ్, బ్యాడ్మింటన్ లలో గెలుపొందిన బాల బాలికలకు అవార్డులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో సుడా చైర్మెన్ జీవీ రామకృష్ణా రావు, జిల్లా మార్కెటింగ్ అధికారి పద్మావతి, అడిషనల్ డీసీపీ లక్ష్మీనారాయణ, జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, డీవైఎస్ఓ రాజవీరు, కార్పొరేటర్ కోలా తిరుపతి, యువ కేంద్రం కో ఆర్డినేటర్ రాంబాబు, జిల్లా ఒలింపిక్ సంఘం జనార్ధన్ రెడ్డి, రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్