- Advertisement -
రంగారెడ్డి: చండీయాగాన్ని దిగ్విజయంగా పూర్తి చేసేందుకు సహకరించిన అందరికి కృతజ్ఞతలుని టీపీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం అయన నివాసంలో జరిగిన చండీయాగం ముగిసింది. రేవంత్ మాట్లాడుతూ కొడంగల్ నియోజకవర్గంతోపాటు రాష్ట్ర ప్రజలు సుఖ, సంతోషాలతో విలసిల్లాలని కోరుకుంటున్నా. తెలంగాణలో ప్రజా రంజకమైన పాలన రావాలని కోరుకుంటున్నా. సంక్షేమం, అభివృద్ధి రాష్ట్రంలో సమాన స్థాయిలో ఉండాలని ఆశిస్తున్నా. చండీయాగంతో రాష్ట్ర ప్రజలకు స్వేచ్ఛ, సమానత్వం, సమాన అభివృద్ధి సిద్దించాలి. తెలంగాణకు మంచిరోజులు వస్తాయని ఆశిస్తున్నా. కొడంగల్ ప్రజల ఆశీర్వాదం వల్లే నేను ఈ స్థాయికి వచ్చా. భవిష్యత్ లో కూడా మీ ఆశీస్సులు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు.

- Advertisement -



