రాయచోటి అర్బన్ సీఐ గా చంద్ర శేఖర్.
Chandra Shekhar as Rayachoti Urban CI.
బద్వేలు
రాయచోటి అర్బన్ సీఐగా సి చంద్రశేఖర్ మంగళవారం బాధ్యతలు చేపట్టారు. సాధారణబదీలలో భాగంగా అనంతపురం వి ఆర్ నుండి రాయచోటి కి చంద్రశేఖర్ బదిలీ అయ్యారు . ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.న్యాయం కోసం వచ్చే వారికి ప్రతి ఒక్కరూ జవాబుదారీతనంగా పనిచేయాలని సిబ్బందికి సూచించారు. అనంతరంరాయచోటి అర్బన్ సీఐగా బాధ్యతలు చేపట్టిన సీఐ పి.చంద్రశేఖర్ ను అన్నమయ్య జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు చెన్నూరి శ్రీనివాసులు కొండూరు రవిప్రకాష్ రాజు (రాజ్ న్యూస్), కార్యవర్గ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా సీఐతో పట్టణ శాంతిభద్రతల పరిస్థితుల పై చర్చించారు. మీడియా సహకారంతో పట్టణ పరిధిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతియుత పట్టణంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని సీఐ చంద్రశేఖర్ తెలిపారు




