చంద్రబాబు అరెస్ట్… మొక్కు చెల్లించుకున్న మంత్రి రోజా

- Advertisement -

చంద్రబాబు అరెస్ట్ తర్వాత వైసీపీ నాయకులంతా దాదాపుగా సంబరాల్లో మునిగిపోయారు. అయితే అందరికంటే ఎక్కువ ఉత్సాహంగా కనిపించిన ఏకైక వ్యక్తి మంత్రి రోజా. సోషల్ మీడియా ద్వారా, మీడియాలోనూ ఆమె తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. చంద్రబాబుకి రిమాండ్ ఖరారైన తర్వాత తన ఇంటి ముందు బాణసంచా కాల్చి స్వీట్లు పంచి పెట్టారు. అదే ఉత్సాహంలో ఆమె ఈరోజు తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్నారు. మొక్కు చెల్లించుకున్నారు. 2024లో తెలుగుదేశం పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పాలని స్వామివారిని కోరుకున్నట్లు ఆమె చెప్పారు. చంద్రబాబు అరెస్ట్ కక్షసాధింపు కాదన్నారు రోజా. స్కిల్ డెవలప్మెంట్ కేసులో అడ్డంగా‌ దొరికి పోవడం వల్లే ఆయన జైలుకి వెళ్లారన్నారు. చంద్రబాబుకి శిక్ష పడాలని రాష్ట్ర ప్రజలందరూ భగవంతుడిని ప్రార్థించారని, అందుకే ఆయన కటకటాల పాలయ్యారని చెప్పారు. చంద్రబాబు ఎంత మందిని జైలుకు పంపారో, ఎంతమంది జీవితాలను నాశనం చేశారో, ఎంతమంది ప్రాణాలు తీశారో.. వారి ఉసురు ఇప్పుడు తగిలిందన్నారు. అది అక్రమ కేసు కాదని అడ్డంగా దొరికిపోయిన కేసు అని విమర్శించారు. యువతను ఆదుకోవాల్సిన చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ స్కాము ద్వారా కోట్ల రూపాయలు దోచుకున్నారన్నారు.. 2014లో బాబు వస్తే జాబు వస్తుందంటూ నిరుద్యోగ యువతను మోసం చేశారని విమర్శించారు.

Chandrababu Arrested... Minister Roja who paid the money
Chandrababu Arrested… Minister Roja who paid the money
- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular