21.2 C
New York
Friday, May 31, 2024

చంద్రబాబు నాయుడు ని మళ్లీ సీఎం గా చూడాలి  బల్కంపేట ఎల్లమ్మకి 101 కొబ్బరికాయలు  టిఎన్ఎస్ఎఫ్ అధ్యకులు రవీందర్

- Advertisement -

ఆంధ్రప్రదేశ్లో మళ్లీ టీడీపీ అధికారం లోకి రావాలి
చంద్రబాబు నాయుడు ని మళ్లీ సీఎం గా చూడాలి
 బల్కంపేట ఎల్లమ్మకి 101 కొబ్బరికాయలు  టిఎన్ఎస్ఎఫ్ అధ్యకులు రవీందర్ ఆధ్వర్యంలో సమర్పణ
హైదరాబాద్
ఏపీలో కూటమి అభ్యర్థులు విజయం సాధించాలని మరియు చంద్రబాబు నాయుడు  ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలని అదే విధంగా మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ బాబు అత్యధిక మెజార్టీతో విజయం సాధించాలని తెలంగాణ టిఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో బల్కంపేట ఎల్లమ్మ తల్లికి నూట ఒక కొబ్బరికాయలు కొట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వచ్చిన  తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షురాలు కాట్రగడ్డ ప్రసూన  మాట్లాడుతూ
ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి చరమగీతం పాడడానికి సిద్ధంగా ఉన్నారని మరియు ఆంధ్రప్రదేశ్లో కూటమి అభ్యర్థులు భారీ విజయం సాధించబోతున్నారని నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని ఇందుకుగాను బల్కంపేట ఎల్లమ్మ ఆశీస్సులు కోరుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో టీటిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు కాట్రగడ ప్రసూనా  బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీపతి సతీష్.. టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు రవీంద్ర.. అమీర్పేట్ డివిజన్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ యాదవ్ లు  పాల్గొన్నారు. అనంతరం తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ బిజెపి అభ్యర్థి కిషన్ రెడ్డికి మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు, తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు తప్పకుండా విజయం సాధిస్తారని వారి గెలుపు కోసం గెలుపు కోసం టీ టిడిపి నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!