వరద ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన

- Advertisement -

 వరద ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన

Chandrababu’s visit to flood areas

విజయవాడ, సెప్టెంబర్ 5
విజయవాడ  నగరంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు గురువారం మరోసారి పర్యటించారు. ఎనికేపాడు వద్ద ఏలూరు కాలువ దాటి బుడమేరు  ముంపు ప్రాంతాల్లో బల్లకట్టుపై వెళ్లి పరిశీలించారు. గండ్లు పడిన ప్రాంతాల్లో పనులపై ఆయన అధికారులతో చర్చించి.. పంట నష్టం వివరాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. కేసరపల్లి వద్ద బుడమేరు కాల్వపై వరద ఉద్ధృతిని పరిశీలించారు. విజయవాడకు మరోసారి ఇలాంటి విపత్తు రాకుండా చర్యలు చేపట్టాలని అన్నారు. బుడమేరుకు వరద తగ్గనందున బాధ్యతగా పని చేయాలన్నారు. బుడమేరు కాల్వ ప్రక్షాళన చేపడతామని.. గతంలోనే కాల్వ ఆధునీకరణకు నిధులు కూడా కేటాయించామని చెప్పారు. మరోవైపు, విజయవాడలో ముంపు ప్రాంతాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. వరద పూర్తిగా తగ్గిన చోట మున్సిపల్ సిబ్బంది పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు. ఇతర ప్రాంతాల నుంచి పారిశుద్ధ్య కార్మికులు ఇక్కడ పని చేస్తున్నారు. దాదాపు 2 వేల మంది కార్మికులు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు.
కొల్లేరు ఉద్ధృతి
అటు, ఏలూరు జిల్లాలో కొల్లేరు సరస్సు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. చిన్నఎడ్లగాడి, పెదఎడ్లగాడి పరిసర ప్రాంతాలతో పాటు ఏలూరు – కైకలూరు రహదారిపైకి వరద నీరు చేరింది. ఈ క్రమంలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైవేపై మోకాలి లోతు నీరు చేరడంతో బస్సులు, ఇతర వాహనాలు ప్రమాదకరంగా ముందుకు సాగుతున్నాయి. వరద తీవ్రత దృష్ట్యా లంక గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. పెనుమాక, ఇంగిలిపాక, నందిగామ లంక, కొవ్వాడలంక, నుచ్చుమిల్లి గ్రామాలకు వరద పోటెత్తడంతో కొల్లేరు వాసులు భయాందోళనకు గురవుతున్నారు. అటు, పాదచారులు, వాహనదారులు కొల్లేరును దాటే ప్రయత్నం చెయ్యొద్దని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. అత్యవసర సమయాల్లో ప్రజలకు నిత్యావసరాలు, మందులను ప్రభుత్వం సరఫరా చేస్తుందని చెప్పారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular