- Advertisement -

సికింద్రాబాద్,అక్టోబర్ 28(వాయిస్ టుడే ప్రతినిధి): ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంసీఏ పరీక్షా తేదీలను మార్చినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శ్రీరాములు ఒక ప్రకటనలో తెలిపారు. టీఎస్ సెట్ పరీక్ష నిర్వహించనున్న నేపథ్యంలో ఈ నెల 30వ నిర్వహించాల్సిన ఎంసీఏ నాలుగో సెమిస్టర్ మెయిన్, రెండు, నాలుగో సెమిస్టర్ బ్యాక్ లాగ్ పరీక్షలను వాయిదా వేసినట్లు చెప్పారు. ఈ పరీక్షలను తిరిగి వచ్చే నెల 21వ తేదీన నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పరీక్షా కేంద్రం, సమయంలలో ఎటువంటి మార్పు ఉండబోదని స్పష్టం చేశారు. ఇతర వివరాలకు ఓయూ వెబ్సైట్ www.osmania.ac.inలో చూసుకోవచ్చని సూచించారు.
- Advertisement -



