Sunday, September 8, 2024

రేషన్ కార్డులలో మార్పులకు..ఓకే…

- Advertisement -

రేషన్ కార్డులలో మార్పులకు..ఓకే…
వరంగల్, జూలై 8,
రేషన్ కార్డులకు సంబంధించి మరో కీలక అప్డేట్ వచ్చేసింది. ఓవైపు కొత్త రేషన్ కార్డుల మంజూరుకు కసరత్తు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం… మరోవైపు ఎడిట్ ఆప్షన్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది.ప్రభుత్వ తాజా నిర్ణయంతో రేషన్‌ కార్డుల్లో మార్పులు చేసుకునే వీలు ఉంది. మీసేవా కేంద్రాల్లో అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే ఉన్న రేషన్ కార్డుల్లో పేరు మార్పులతో పాటు ఇప్పటి వరకు పేర్లు ఎక్కనివారు కూడా ఎంట్రీ చేసుకునే వీలు ఉంది. సవరణల కోసం మీసేవా కేంద్రాలకు వెళ్లి అప్లికేషన్ సమర్పించాల్సి ఉంటుందిమరోవైపు త్వరలోనే తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు జారీ చేయనున్నారు. పాత వాటిస్థానంలో కొత్త రూపంలో కార్డులు అందించనున్నారు.  కొత్తకార్డుల మంజూరు దిశగా ఇప్పటికే సర్కార్ కసరత్తు చేయగా.. ఎన్నికల కోడ్ తర్వాత ఆగిపోయింది. కోడ్ ఎత్తివేయటంతో కీలక నిర్ణయాలు తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది.కొత్త కార్డుల మంజూరుపై కేబినెట్ భేటీలో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఆ వెంటనే ఉత్తర్వులు జారీ అవుతాయని తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. కొత్త కార్డుల కోసం అవకాశం ఇస్తే… మరో 10 లక్షలు కుటుంబాల నుంచి దరఖాస్తులు వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు.ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా తెల్ల కాగితంపై రేషన్ కార్డుల కోసం ప్రభుత్వం దరఖాస్తులను స్వీకరించింది. అంతేకాకుండా కుటుంబ సభ్యుల వివరాలను చేర్చే వారి నుంచి కూడా అప్లికేషన్లను తీసుకుంది. అయితే వీటి కోసం సదరు కుటుంబాలు… తెల్ల కాగితంపై రాసి దరఖాస్తు చేసుకున్నాయి.కొత్త రేషన్ కార్డులపై నిర్ణయం తీసుకుంటే… ఈసారి మీసేవా పోర్టల్ ద్వారా స్వీకరించే అవకాశం ఉంది.ఉమ్మడి రాష్ట్రంలో ఒక చిన్న పుస్తకం తరహాలో రేషన్‌ కార్డులు ఉండేవి. కుటుంబ యాజమాని పేరుపై కార్డు జారీ చేశారు. కార్డులు కుటుంబ సభ్యుల ఫొటో, పూర్తి వివరాలు ఉండేవి. ఆ తర్వాత వీటిస్థానంలో రైతు బంధు పాస్‌బుక్‌ సైజ్‌లో రేషన్‌ కార్డులు అందించారు. ఈ కార్డుల్లో ముందువైపు కుటుంబ సభ్యుల ఫొటో, కుటుంబ సభ్యుల వివరాలు ఉండేవి.వెనుక భాగంలో చిరునామా, ఇతర వివరాలు ఉండేవి. అయితే అనంతరం ఆ తర్వాత రేషన్‌ కార్డుల స్థానంలో ఆహార భద్రత కార్డులు జారీ చేశారు. సింగిల్ కార్డులో యజమాని, కుటుంబ సభ్యుల ఫొటో లేకుండా ముద్రించారు. కార్డుదారు, కుటుంబ సభ్యులు, రేషన్‌ షాపు వివరాలు మాత్రమే కార్డులో ఉండేవి. ఇప్పుడు వీటి స్థానంలో కొత్త తరహాలో రేషన్ కార్డులను ఇవ్వాలని తెలంగాణ సర్కార్ భావిస్తోంది. దీనిపై కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.ప్రతి స్కీమ్ కు రేషన్ కార్డును ప్రమాణికంగా పరిగణిస్తున్న నేపథ్యంలో…. కొత్త కార్డుల కోసం చాలా మంది ఎదురుచూస్తున్నారు. త్వరలోనే వీటిపై ప్రభుత్వం ప్రకటన చేసే అవకాశం ఉంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్