Friday, January 17, 2025

గ్రామాల్లో మారనున్న రాజకీయం

- Advertisement -

గ్రామాల్లో మారనున్న రాజకీయం

Changing politics in villages

నల్గోండ, డిసెంబర్ 24, (వాయిస్ టుడే)
రాష్ట్రంలో పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించడంతో ఇక మీదట పంచాయతీల్లో రాజకీయ ముఖ చిత్రం మారబోతోంది. రాబోయే పంచాయతీ ఎన్నికల కోసం పలు సంస్కరణలను కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా ముగిసిన అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపాదించగా ఆ చట్ట సవరణ బిల్లు ఉభయ సభల్లో ఆమోదం పొందింది. దీంతో గవర్నర్ ఆమోదముద్ర వేసిన తర్వాత చట్టం అమల్లోకి రాబోతోంది. ఈ చట్టం లో పలు కీలకాంశాలను ప్రతిపాదించడం ద్వారా పంచాయతీ ఎన్నికల నాటికి రాజకీయంగా పలు ప్రాధాన్యతలు చోటు చేసుకోనున్నాయి. ముఖ్యం గా రిజర్వేషన్ల అంశంపై గ్రామ స్థాయి నుంచి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. గత ప్రభుత్వం 2018 లో పదేళ్ల పాటు ఇదే రిజర్వేషన్లు కొనసాగేలా చేసిన చట్టాన్ని ఇప్పుడు సవరించడం వల్ల రిజర్వేషన్ల అంశం మళ్లీ తెరమీదకు వచ్చింది.కొత్త చట్ట సవరణ వల్ల పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్‌లలో రిజర్వేషన్లు తారుమారు కాబోతున్నా యి. స్థానిక సంస్థల ఎన్నికలలో రిజర్వేషన్లు మారనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో పోటీ చేసేందుకు ఎప్పటినుంచో రంగం సిద్ధం చేసుకుంటున్న ఆశావహులు ఇప్పుడు డైలమాలో పడిపోయారు. పదేండ్లపాటు రిజర్వేషన్లు అమలులో ఉం డేలా గత ప్రభుత్వం నిర్ణయం తీసుకుని మంత్రివర్గ ఆమోదం తెలిపింది. ఆ రిజర్వేషన్ల ప్రకారమే ఈసారి కూడా రిజర్వేషన్లు అమలవుతాయని, మ ళ్లీ గెలిచి అధికారంలోకి రావచ్చనే ఆశావాహుల ఆశయాలకు గండిపడింది. ఆశావహులు వారు పోటీ చేయదలచుకున్న స్థానాలపై దృష్టి సారించి పలు అభివృద్ధి పనులు చేశారు. దీంతో ప్రస్తుత చట్ట సవరణ అమల్లోకి రాగానే రాజకీయంగా ప్రాధాన్యతలు, అంచనాలు మారబోతున్నాయి.వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల సమయానికి ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీ, జెడ్పీ చైర్మన్‌తో పాటు, మున్సిపాలిటీలు వార్డులు, మున్సిపల్ చైర్మన్ పదవుల్లో సైతం రిజర్వేషన్లు మారనున్నాయి. దీంతో తాము పోటీ చేయదలచుకున్న స్థానం ఎక్కడ రిజర్వేషన్ అవుతుందో అనే భయంతో ఆశావహులు ప్రస్తుతం స్తబ్ధతగా ఉన్నారు. రిజర్వేషన్ల ప్రక్రియ ప్రకటించిన అనంతరం తమ తమ ప్రయత్నాలను ముమ్మరం చేయాలన్న ఆలోచనలతో అడుగులు ముందుకు వేస్తున్నారు. ఇప్పటి వరకు తమకే ఉంటాయి అనుకున్న రిజర్వేషన్లు అన్నీ మారుతుండడంతో కిందిస్థాయి రాజకీయాలలోనూ పలు మార్పు లు చేర్పులు ఉంటాయి అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సర్పంచ్, ఎంపీటీసీలతో పాటు ఆయా మున్సిపాలిటీలలోనూ వార్డు మెంబర్ల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశాలు ఉంద ని తెలుస్తోంది. చట్టసవరణలో పలు కీలకాంశాలు ఇలా..చట్టాన్ని తాజాగా సవరించడం ద్వారా రిజర్వేషన్ల అంశంతో పాటు పలు ఇతర నిబంధనలు అమల్లోకి రాబోతున్నాయి. ఇక పంచాయతీరాజ్‌లో ఒకే విడత రిజర్వేషన్ విధానం అమల్లోకి వస్తుంది. పంచాయతీరాజ్ వ్యవస్థలో భాగమైన గ్రామపంచాయతీలు, మం డల, జిల్లా పరిషత్‌లలో రిజర్వేషన్లు ఇక నుంచి ప్రతిసారి ఎన్నికల సమయంలో మారనున్నా యి. గత ప్రభుత్వంలో చేసిన చట్ట సవరణ వల్ల రిజర్వేషన్లు రెండు పర్యాయాలు అమల్లో ఉం డగా, దీనిని తొలగిస్తూ పంచాయతీరాజ్ చట్టం లో సవరణలు చేశారు. దీంతో ఐదేళ్లకోసారి పంచాయతీ ఎన్నికలు జరిగితే అప్పుడు మరోసారి రిజర్వేషన్లను ప్రభుత్వం ప్రకటిస్తుంది.ప్రతి మండలానికి కనీసంమండలంలో కనీసం ఐదుగురు ఎంపిటిసిలు ఉండే విధంగా ప్రభుత్వం ఈ చట్టంలో సవరణ చేసింది. ప్రస్తుతం ఉన్న చట్టంలో జనాభా ప్రాతిపదికన ఉండడంతో కొన్ని చోట్ల ఇద్దరు, ముగ్గురు, మరికొన్ని చోట్ల ఐదుగురు, మరికొన్ని చోట్ల పది మంది ఎంపిటిసిలు ఉన్నారు. దీంతో ముగ్గురు ఎంపిటిసిలు ఉన్నచోట్ల పరిపాలనాపరమైన కొన్ని ఇబ్బందులు తలెత్తతుండడంతో ఈ నిబంధనను సవరించాలని ప్రజాప్రతినిధులు, ఆయా సంఘాలు ప్రభుత్వంపై చాలా రోజులు గా ఒత్తిడి తెచ్చాయి. దీంతో చట్టసవరణకు ప్రతిపాదించిన అంశాల్లో ఇక నుంచి ప్రతి మండల పరిషత్ పరిధిలో కనీసం అయిగురు ఎంపిటిసిలు ఉండేలా నిబంధనను పొందుపర్చారు.
కలెక్టర్‌కి ఉప సర్ంపచ్‌నుగత ప్రభుత్వంలో అమల్లో ఉన్న చట్టంలో పేర్కొన్న నిబంధనల్లో ముఖ్యమైనది కలెక్టర్‌కు పంచాయతీలకు ఉన్న అధికారం. సర్పంచ్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న వ్యక్తి ప్రభుత్వ ఆదేశాలు అమలు చేయకపోవడం, నిధుల దుర్వినియోగానికి పాల్పడితే ఆ సర్పంచ్‌ను సస్పెండ్ చేసే అధికారం జిల్లా కలెక్టర్‌కు ఉండేది. అయితే ఆ తర్వాత ఉప సర్పంచ్‌గా ఉన్న వ్యక్తి సర్పంచ్‌గా బాధ్యతలు స్వీకరించినప్పుడు అతడు కూడా అవినీతికి పాల్పడితే తొలగించే అధికారం కలెక్టర్‌కు ఉండేది కాదు. దీనిపైనా సర్పంచ్‌ల చాంబర్, ప్రజాప్రతినిధుల సంఘాల నుంచి అనేక ఫిర్యాదులు విజ్ఞప్తులు రావడంతో పంచాయతీరాజ్ చట్టసవరణలో ఈ అంశాన్ని చేర్చింది. తాజా సవరణల్లో సర్పంచ్‌గా బాధ్యతలు నిర్వహించే ఉప సర్పంచ్‌ను కూడా సస్పెండ్ చేసే అధికారం కూడా కలెక్టర్‌కు ప్రభుత్వం అప్పగించింది.స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్‌లతో పాటు వార్డు సభ్యులు సైతం తమ ఎన్నికల ఖర్చు వివరాలను ఎన్నికల సంఘానికి సమర్పించా ల్సి ఉండేది. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా చేపట్టిన సవరణల్లో భాగంగా వార్డు సభ్యులకు మినహాయింపు లభించింది. దీంతో ఇక మీదట జరిగే ఎన్నికల్లో వార్డు సభ్యులు ఎన్నికల ఖర్చులను సమర్పించాల్సిన అవసరం లేదు.ఔటర్ రింగురోడ్డు పరిధిలోని 51 గ్రామ పంచాయతీలను సమీప పురపాలక సంఘాల్లో విలీనం చేస్తూ చట్టాన్ని సవరించారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 80 గ్రామ పంచాయతీలను స్థానిక పురపాలక సంఘాల్లో విలీనం చేస్తూ చట్టంలో సవరణలు చేశారు. దీంతో ఇప్పటి వరకు ఆయా పంచాయతీల పరిధిలో ఉన్న ఆశావాహులకు పదవుల్లో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్