- Advertisement -
గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అపశృతి
కరెంట్ షాక్ తో ఇద్దరు మృతి
ములుగు
గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. ములుగు జిల్లా కేంద్రం ఎస్సీ కాలనీలో కరెంట్ షాక్ కు యువకులు గురయ్యారు. ఇద్దరు మృతి చెందగా , మరో ఇద్దరికి గాయాలు అయ్యాయి. జాతీయ జెండా ఆవిష్కరణ కోసం పనులు చేస్తుండగా జెండా పైపు కరెంట్ తీగకు తాకడంతో ప్రమాదం జరిగింది. బోడ అంజిత్, లాడ విజయ్ అనే ఇద్దరు యువకులు మృతి చెందారు. బోడ చక్రి, మరొకరికి గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు.
- Advertisement -