Wednesday, December 4, 2024

వెన్నెల కిశోర్ హీరోగా  చారి 111

- Advertisement -

వినోదానికి కేరాఫ్ అడ్రస్ ‘వెన్నెల’ కిశోర్. మేనరిజమ్స్ కావచ్చు, డైలాగ్ డెలివరీ కావచ్చు, నటనతో కావచ్చు… వినోదంలో వైవిధ్యం చూపిస్తూ, ప్రేక్షకులకు నవ్వులు పంచుతూ అలరిస్తున్నారు. హాస్య నటుడిగా మాత్రమే కాదు, కథానాయకుడిగానూ తనకు సూటయ్యే క్యారెక్టర్లు వచ్చినప్పుడు సినిమాలు చేస్తుంటారు. ‘వెన్నెల’ కిశోర్ హీరోగా నటిస్తున్న తాజా సినిమా ‘చారి 111’.

‘వెన్నెల’ కిశోర్ కథానాయకుడిగా బర్కత్ స్టూడియోస్ పతాకంపై అదితి సోనీ నిర్మిస్తున్న సినిమా ‘చారి 111’. టీజీ కీర్తి కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. సుమంత్ హీరోగా నటించిన హిట్ సినిమా ‘మళ్ళీ మొదలైంది’ తర్వాత ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. ఇందులో ‘వెన్నెల’ కిశోర్ సరసన సంయుక్తా విశ్వనాథన్ కథానాయికగా నటిస్తున్నారు. మురళీ శర్మ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈరోజు సినిమాను ప్రకటించడంతో పాటు కాన్సెప్ట్ టీజర్ కూడా విడుదల చేశారు.

ఎప్పుడు ప్రశాంతంగా ఉండే సిటీకి ప్రమాదం వచ్చి పడుతుంది. దానిని ఎదిరించడం కోసం మాజీ ఆర్మీ అధికారి ప్రసాద్ రావు (మురళీ శర్మ) వస్తారు. అసలు, ఆ సమస్య ఏమిటి? విలన్ ఎవరు? అనేది వెల్లడించలేదు. కానీ, హీరో క్యారెక్టర్ ఏమిటనేది చాలా క్లారిటీగా చూపించారు. కన్‌ఫ్యూజ్డ్ స్పై పాత్రలో వెన్నెల కిశోర్ వినోదం అందించనున్నారు. ఈషా పాత్రలో హీరోయిన్ సంయుక్త విశ్వనాథన్, మహి పాత్రలో ప్రియా మాలిక్ నటిస్తున్నట్లు తెలిపారు. హీరోయిన్ ఫైట్స్ చేయనున్నట్లు చూపించారు.

‘చారి 111’ గురించి చిత్ర దర్శకుడు టీజీ కీర్తి కుమార్ మాట్లాడుతూ ”ఇదొక యాక్షన్ కామెడీ సినిమా. ఇందులో ‘వెన్నెల’ కిశోర్ గూఢచారి (స్పై) పాత్రలో కనిపిస్తారు. ఓ సిటీలో జరిగే అనుమానాస్పద ఘటనలను చేధించే రహస్య గూఢచారి పాత్రలో ఆయన లుక్ స్టైలిష్‌గా ఉంటుంది. అలాగే, ఆ పాత్రలో ఓ కన్‌ఫ్యూజన్ ఉంటుంది. అది ఏమిటి? గూఢచారి ఏం చేశాడు? అనేది స్క్రీన్ మీద చూడాలి. గూఢచారి సంస్థ హెడ్‌గా కథలో కీలకమైన పాత్రలో మురళీ శర్మ కనిపిస్తారు. స్టైలిష్ యాక్షన్ సన్నివేశాలతో ఆద్యంతం వినోదభరితంగా సాగుతూ ప్రేక్షకుడిని మా సినిమా అలరిస్తుంది” అని చెప్పారు.

చిత్ర నిర్మాత అదితి సోనీ మాట్లాడుతూ ”స్పై జానర్ సినిమాల్లో ‘చారి 111’ కొత్తగా ఉంటుంది. ‘వెన్నెల’ కిశోర్ గారి నటన, టీజీ కీర్తి కుమార్ దర్శకత్వం సినిమాకు హైలైట్ అవుతాయి. కథలో చాలా సర్‌ప్రైజ్‌లు ఉన్నాయి. అందులో విలన్ రోల్ ఒకటి. విలన్ ఎవరనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఇప్పటి వరకు చిత్రీకరణ చేసిన సన్నివేశాలు మాకు ఎంతో సంతృప్తిని ఇచ్చాయి. షూటింగ్ శరవేగంగా జరుగుతోంది” అని చెప్పారు.

‘వెన్నెల’ కిశోర్, సంయుక్తా విశ్వనాథన్, మురళీ శర్మ, బ్రహ్మాజీ, సత్య, రాహుల్ రవీంద్రన్, పావని రెడ్డి, ‘తాగుబోతు’ రమేష్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు  ఎడిటింగ్ : రిచర్డ్ కెవిన్ ఎ, స్టంట్స్ : కరుణాకర్, ప్రొడక్షన్ డిజైన్ : అక్షత బి హొసూరు, పీఆర్వో : పులగం చిన్నారాయణ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : బాలు కొమిరి, సాహిత్యం : సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి, సినిమాటోగ్రఫీ : కషిష్ గ్రోవర్, సంగీతం : సైమన్ కె కింగ్, నిర్మాణ సంస్థ : బర్కత్ స్టూడియోస్, నిర్మాత : అదితి సోనీ, రచన, దర్శకత్వం : టీజీ కీర్తీ కుమార్.

Chari 111 as Vennela Kishore as hero
Chari 111 as Vennela Kishore as hero
- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్