Thursday, March 12, 2026

చార్మింగ్ స్టార్ శర్వా హైదరాబాద్‌లో కీలక రేసింగ్ సన్నివేశాలు షూటింగ్

- Advertisement -

చార్మింగ్ స్టార్ శర్వా, అభిలాష్ కంకర, UV క్రియేషన్స్, #Sharwa36 హైదరాబాద్‌లో కీలక రేసింగ్ సన్నివేశాలు షూటింగ్
Charming Star Sharwa shoots key racing scenes in Hyderabad
చార్మింగ్ స్టార్ శర్వా తన 36వ మూవీ #Sharwa36 లో స్కిల్డ్ మోటార్ సైకిల్ రేసర్ గా కనిపించబోతున్నారు. అభిలాష్ కంకర దర్శకత్వం లో ప్రతిష్టాత్మక UV క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.  ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. శర్వా, టీమ్‌పై రేస్ కు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సన్నివేశాలు సినిమాలో హైలైట్‌గా వుండబోతున్నాయి.ఈరోజు మేకర్స్ శర్వానంద్ పర్సనల్ స్టిల్స్‌ని విడుదల చేశారు. స్టైలీష్ మేకోవర్‌లో శర్వా లుక్స్ అదిరిపోయాయి. శర్వా ఫ్యాషన్‌ ట్రెండీ క్లాసీ లుక్ లో ఆకట్టుకున్నారు.  యూనిక్ క్యారెక్టర్స్ తో ఆకట్టుకునే శర్వా, ఈ చిత్రంలో ఓ ఛాలెంజింగ్ క్యారెక్టర్ చేస్తున్నారు. మునుపెన్నడూ లేనివిధంగా ఆడ్రినలిన్ రష్‌ని ఇచ్చే స్టంట్స్ తో అదరగొట్టబోతున్నారు.ఈ చిత్రంలో మాళవిక నాయర్ కథానాయికగా నటించగా, బ్రహ్మాజీ, అతుల్ కులకర్ణి కీలక పాత్రలు పోషించారు.వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్న ఈ హై-ఎనర్జీ మూవీ మోటోక్రాస్ రేసింగ్ బ్యాక్ డ్రాప్ లో ఉండబోతోంది.ఈ చిత్రానికి జె యువరాజ్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తూ, ఎక్సయిటింగ్ విజువల్స్‌ ని అందిస్తున్నారు. గిబ్రాన్ ఈ చిత్రానికి డైనమిక్ సౌండ్‌ట్రాక్‌ను కంపోజ్ చేస్తున్నారు. అనిల్ కుమార్ పి ఎడిటర్‌గా, ఎన్ సందీప్ ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. రాజీవన్ ప్రొడక్షన్ డిజైనర్, ఎ పన్నీర్ సెల్వం ఆర్ట్ డైరెక్టర్.
నటీనటులు: చార్మింగ్ స్టార్ శర్వా, మాళవిక నాయర్, బ్రహ్మాజీ, అతుల్ కులకర్ణి తదితరులు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్