Thursday, February 19, 2026

చంద్రబాబు నాయుడు పాలనలో ప్రతీ అంశంలోనూ మోసమే కనిపిస్తోంది :మాజీ సిఎం వైసిపి జగన్ మోహన్ రెడ్డి

- Advertisement -

చంద్రబాబు నాయుడు పాలనలో ప్రతీ అంశంలోనూ మోసమే కనిపిస్తోంది
                మాజీ సిఎం వైసిపి జగన్ మోహన్ రెడ్డి
అమరావతి ఫిబ్రవరి 19

Cheating is visible in every aspect of Chandrababu Naidu’s rule: Former CM YSRCP Jagan Mohan Reddy
ఎపి సిఎం చంద్రబాబు నాయుడు పాలనలో ప్రతీ అంశంలోనూ మోసమే కనిపిస్తోందని మాజీ సిఎం వైసిపి జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. గతంలో ఎన్నడూ లేనట్లుగా అప్పులు చేస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అప్పుల్లో ఆల్ టైం రికార్డులు బద్దలు కొడుతున్నారని, ఉన్న స్కీములను తీసేసారు.. కొత్త స్కీములు లేవు అని విమర్శించారు. అప్పులతో తెచ్చిన డబ్బంతా దోచుకో.. తినుకో.. పంచుకో అన్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. ఎన్నికలకు ముందు ఇంటింటికీ వెళ్లి బాండ్లు పంచారని, ఇప్పుడు ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు మాటలు కోటలు దాటుతున్నాయి.. చేతలు గడప దాటవు అని తెలియజేశారు. తాము మేనిఫెస్టోలోని 99 శాతం హామీలు నెరవేర్చామని చంద్రబాబుకు మాత్రం మేనిఫోస్టో అంటే చిత్తుకాగితం అని ధ్వజమెత్తారు. నిరుద్యోగ భృతి ఏమైంది? అని ప్రశ్నించారు. కోవిడ్ లాంటి సమయంలోనూ తాము మేనిఫెస్టో అమలు చేశామని, నిరుద్యోగ భృతి హామీ ఇవ్వడం చంద్రబాబుకు మొదటిసారి కాదు అని అన్నారు ప్రతి నెలా అబద్ధాలు చెబుతున్నారని.. ప్రతీ మీటింగ్ కు ఒక పెన్షన్ కట్ చేస్తున్నారని, నిరుద్యోగులకు రూ.21 వేల 600 కోట్లు, ఈ మూడేళ్లలో మహిళలకు రూ. 97 వేల 200 కోట్లు, ప్రతి మహిళకు రూ.54 వేలు చంద్రబాబు బకాయిపడ్డారని చెప్పారు. ప్రతి మహిళలకు నెలకు 1500 ఇస్తామన్నారు.. బడికి వెళ్లే ఒక్కో పిల్లాడికి ఏటా రూ.15 వేలు ఇస్తామన్నా.. ఏమైంది? అని ప్రశ్నించారు. తాము 66 లక్షల 34 వేల 372 మందికి పెన్షన్లు ఇచ్చామని, 18-60 ఏళ్ల లోపు మహిళలకు కోటీ 80 లక్షల మంది ఉన్నారని అన్నారు. తల్లికి వందనం పథకాన్ని నిర్వీర్యం చేశారని, 18 నెలల్లోనే బాబు 5 లక్షల 38 వేల 636 పెన్షన్లు కట్ చేశారని ధ్వజమెత్తారు. తమ హయాంలో ఆరు నెలలకోసారి కొత్త పెన్షన్లు అప్ డేట్ అయ్యేవని, ఈ ఏడాది 7 లక్షల 45 వేల 993 పెన్షన్లు కట్ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైందని పేర్కొన్నారు. గ్యాస్ లో కూడా భారీగా కోత పెట్టారని, ఏటా 3 సిలిండర్లు ఇస్తామన్నారు.. ఇప్పటి వరకు ఎంతమందికి ఇచ్చారు? అని ప్రశ్నించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్