Check for sugar problem - Navara Rice
ఉడికించిన అన్నంలో నుంచి వచ్చే నీళ్ళని గంజి అంటారు. గంజి చాలా బలమైనది మరియు ఆరోగ్యానికి చాలా మంచిది. పూర్వీకులు అన్నం లొ నుండి వచ్చే నీళ్ళని గంజిగా చేసుకొని తాగేవాళ్ళు. అలాoటి గంజిని నవారా రైస్ తో కలిపి చేస్తే మరిన్ని హెల్త్ బెనిఫిట్స్ పొందవచ్చు. ఈ గంజి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెల్సుకుందాం. అవేoటి….?
మానవ శరీరానికి ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా అవసరం . ఇమ్యూనిటి పవర్ తక్కువ అయితే ఎన్నో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా వర్ష కాలంలోనీ సీజనల్ వ్యాధులు వల్ల చాలా ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. వాటిని కంట్రోల్ చేయడానికి అల్లోపతీ మందులు వాడుతుంటారు. అలా కాకుండా ఇంట్లోనే సొంతంగా తయారు చేసే కొన్ని ఫుడ్స్‌ని తీసుకోవడం వల్ల కూడా చాలా ఆరోగ్య సమస్యల్ని దూరం చేసుకోవచ్చు అని మీకు తెలుసా…..?
మన ఆరోగ్యం మెరుగు పరచడంలో గంజి కీలక పాత్ర పోషిస్తుంది. ఆ గంజిని ఇతర హెల్తీ పదార్ధాలతో కలిపి చేస్తే ఆరోగ్యానికి చాలా మంచిది. అలా చేయడం వల్ల షుగర్ లాంటి సమస్యలు కూడా దూరమవుతాయి. మరి ఈ గంజిని ఎలా తయారు చేయాలో ఒక్క లుక్కేద్దాం రండి…..!
1) కావాల్సిన పదార్థాలు
2) నవారా(రెడ్) రైస్
3) నెయ్యి
4) మెంతులు
5) కొబ్బరిపాలు
6) ఉల్లిపాయలు
7) వెల్లుల్లి
8) జీలకర్ర
9) ఎండుమిర్చి
తయారీ విధానం :
ముందుగా గంజి తయారు చేయడానికి గ్లాస్ నవారా రైస్, టేబుల్ స్పూన్ మెంతులు తీసుకోవాలి. వీటిని బాగా మెత్తగా ఉడికించాలి. బాగా ఉడికిన తర్వాత మిక్సర్ జార్‌లో కొద్దిగా కొబ్బరి, కొబ్బరిపాలు వెయ్యాలి. తర్వాత చిన్న ఉల్లిపాయ, వెల్లుల్లి మిక్సీ పట్టాలి. తర్వాత నెయ్యిలో జీలకర్ర, చెక్క, ఎండు మిర్చి వేసి అందులోని కొబ్బరి మిశ్రమం, నవరా రైస్ మిశ్రమాన్ని కలపాలి. అంతే…. దీనిని ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్ లాగా, రాత్రి డిన్నర్‌లాగా తినొచ్చు ఆరోగ్యం మెర్గుపడటమే కాకుండా హెల్తీగా ఉంటారు.12:03 PM



