సంతోషకరమైన జీవితం కోసం చీరప్ భారత్

- Advertisement -

చీరప్ భారత్ పోస్టర్ ఆవిష్కరించిన చిన్న జీయర్ స్వామి

ఈనాటి సమాజంలో చిన్నపిల్లల నుండి పెద్దల వరకు అందరూ కూడా వారి వారి పనుల ఒత్తిడి వల్ల  మానసిక మరియు శారీరక రుగ్మతలకు గురవుతూ సంతోషకరమైన జీవితాన్ని గడపలేకపోతున్నారు. ఈ పరిస్థితి నుండి బయటపడే మార్గం కేవలం కళల ద్వారానే సాధ్యమవుతుందని భావించి సిరిమవ్వ ఆర్ట్స్  బృందం వారు ఒక కొత్త కాన్సెప్ట్ చీరప్ భారత్  (invoking inner happiness) ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సిరి మువ్వా ఆర్ట్స్ వారు 6 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు వయస్సు గల వారికి ఉచితంగా నృత్య కళకళలలో శిక్షణ ఇచ్చి వారిలో మానసిక ఉల్లాసాన్ని పెంపొందించడమే కాకుండా వారికి మెగా డాన్స్ షో ద్వారా కొన్ని వేల మంది ప్రేక్షకుల ముందు  ఆ నృత్యాన్ని ప్రదర్శించే అవకాశాన్ని కలపిస్తున్నారు. గతంలో వీరు 5 సీజన్లో నిర్వహించారు ఆరో సీజన్లో భాగంగా ఈరోజు చీరప్ ఇండియా లోగోను చిన్న జీయర్ స్వామి చేతుల మీదుగా వారి యొక్క ఆశ్రమంలో రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్వామీజీ మాట్లాడుతూ ఒక మనిషిలోని సంతోషాన్ని బయటకి తీసుకురావడం సాధారణంగా జరిగే పని కాదు కానీ ఒక కళ ద్వారా  మాత్రమే ఆ సంతోషాన్ని బయటకు తీసుకురాగలం. ఇది చాలా మంచి కార్యక్రమం దిగ్విజయంగా జరగాలని మనసారా కోరుకుంటూ ఈ లోగోను నా చేతుల మీదుగా లాంచ్ చేస్తున్నందుకు సంతోషంగా ఫీల్ అవుతున్నాను అని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు సిరిమువ్వ ఆర్ట్స్ డైరెక్టర్స్ వై. మధుసూదన్ రావు, వై. తులసి  ప్రముఖ అంతర్జాతీయ మెజీషియన్ సామల వేణు, హైందవి గ్రూప్ ఆఫ్ కాలేజెస్ చైర్మన్ గడ్డం శ్రీనివాస్ యాదవ్, డాన్స్ మాస్టర్ ధావన్ మరియు తదితరులు.

Cheerap Bharat for a happy life
Cheerap Bharat for a happy life
- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular