4.1 C
New York
Thursday, February 22, 2024

బాలికపై చిరుత దాడి..  ఎమ్మెల్యే అనుమానం

- Advertisement -

చిన్నారిని చంపింది చిరుతే

cheetah-attack-on-girl-mlas-suspicion
cheetah-attack-on-girl-mlas-suspicion

తిరుమల, ఆగస్టు 12, వాయిస్ టుడే:  తిరుమల నడకదారిలో చిరుత దాడిలో ప్రాణాలు కోల్పోయిన లక్షిత మృత దేహానికి పోస్టుమార్టం పూర్తయ్యింది. లక్షిత మృతికి చిరుతే కారణం తేల్చారు ఫోరెన్సిక్ నిపుణులు. చిరుతే దాడి చేసినట్లు పోలీసులకకు స్పష్టం చేశారు ఫోరెన్సిక్ డిపార్ట్‌మెంట్ నిపుణులు. లక్షితను చిరుత చంపి తిన్నట్లు నిర్ధారించారు. తల భాగంపై అటాక్ చేసిన చిరుత.. ఆ తల భాగాన్ని తినేసినట్లు తెలిపారు. ఇక పోస్టుమార్టం అనంతరం అనంతరం లక్షిత మృతదేహాన్ని తిరుపతి రుయా మార్చురీ నుంచి నెల్లూరుకు తరలించారు. కాగా, లక్షిత మృతితో ఇటు కుటుంబంలో, అటు గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. రుయా ఆస్పత్రిలో కుటుంబ సభ్యుల రోధనలు మిన్నంటాయి. టీటీడీ, ఫారెస్ట్ అధికారుల తీరును తప్పుపట్టారు లక్షిత తల్లి. వన్య మృగాలు వరుసగా దాడులు చేస్తుంటే.. మెట్ల మార్గాన్ని ఎందుకు మూసివేయడం లేదని ప్రశ్నించారు. భక్తుల ప్రాణాలతో అధికారులు చెలగాటం ఆడుతున్నారని లక్షిత తల్లి కన్నీరుమున్నీరయ్యింది. తమ బిడ్డ మృతికి అధికారుల తీరే కారణమని ఆరోపించారు బాధిత కుటుంబ సభ్యులు. భద్రతా చర్యలు తీసుకుని ఉంటే తమ బిడ్డ ప్రాణాలు పోయేవి కాదు కదా అని ప్రశ్నిస్తున్నారు. ఇక చిన్నారి లక్షిత తిరిగి రాదని తెలిసి పుట్టెడు దుఖంతో గుండెలవిసేలా రోధిస్తోంది ఆ చిన్నారి తల్లి. టీటీడీ అధికారిక లెక్కల ప్రకారం..  తిరుమల అడవిలో చిరుత పులుల సంఖ్య భారీగా పెరిగినట్లు తెలుస్తోంది. చిరుతల కదలికలను గుర్తించామని టీటీడీ అధికారులు చెబుతున్నారు. ఇదే విషయమై మూడు రోజుల క్రితమే మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. అంతలోనే లక్షితపై చిరుత ఎటాక్ చేయడం తీవ్ర కలకం రేపింది. ఇక ఇలాంటి దాడులను నియంత్రించలేమా? అంటే సాధ్యం కాదంటోంది  టీటీడీ.  వన్యప్రాణులను కట్టడి చేయలేమని చెప్పేస్తున్నారు  టీటీడీ అధికారులు. అది తమ పని కూడా కాదని చేతులు దులిపేసుకుంటున్నారు అధికారులు.

మెట్ల మార్గంలో బాలికపై చిరుత దాడి

ఇక దారికి అటూ ఇటూ గ్రిల్స్ పెట్టడంపై కూడా తర్జన భర్జన పడుతున్నారు అధికారులు. ఇలా చేయడానికి వన్యప్రాణ చట్టాలు అడ్డొస్తున్నాయని ఫారెస్ట్ సిబ్బంది చెబుతున్నారు.తిరుమల నడక మార్గంలో పిల్లలకు భరోసా లేదు. పిల్లలతో నడకమార్గంలో వెళ్తున్న వాళ్లు వెయ్యికళ్లతో వాళ్లను కనిపెట్టుకునే ఉండాలి. లేదంటే లక్షిత తరహాలో ఏమైనా జరగొచ్చు. జూన్ 23న చిరుత దాడి నుంచి కౌశిక తప్పించుకోగలిగాడు. పిల్లిని తరుముకుంటూ వచ్చిన చిరుత.. చేతికి అందిన కౌశిక్‌ను ఎత్తుకెళ్లే ప్రయత్నం చేసింది. వెంటనే స్థానికులు అప్రమత్తం కావడంతో బతికి బయటపడ్డాడు. కానీ ఇప్పుడు లక్షిత కథ వేరు. పెద్దలు బిస్కెట్లు కొనేందుకు అలా షాప్‌కి వెళ్లారో లేదో ఇలా ఓ వన్యమృగం నోటకరుచుకువెళ్లిపోయింది. అడవిలోకి లాక్కెళ్లి తలభాగం తినేసింది. ఇప్పటి వరకు అది చిరుతా? ఎలుగుబంటా? అనే సందేహం ఉండగా.. ఫోరెన్సిక్ నిపుణులు మాత్రం లక్షితపై అటాక్ చేసింది చిరుతపులే అని తేల్చారు.

కుటుంబానికి అండగా ఉంటాం

తిరుమల శ్రీనివాసుడి దర్శనానికి వెళ్తున్న లక్షితను చిరుత ఎత్తుకెళ్లి చంపేసింది. శుక్రవారం రాత్రి ఘటన జరిగితే శనివారం ఉదయం పాప మృతి దేహం లభించింది. చిరుత దాడిలో ఆరేళ్ల చిన్నారు మృతి చెందిందని తెలుసుకున్న వారంతా అయ్యో పాపం అనుకున్నారు. భవిష్యత్‌లో ఇలాంటివి జరగకుండా కఠినమైన చర్యలు చేపట్టాలని కూడా సూచనలు చేశారు.

తమ ఇంటి బిడ్డను కోల్పోయిన లక్షిత తల్లిదండ్రులు కూడా బోరున విలపిస్తున్నారు. ఈ చిన్నారి మృతిపై వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తన నియోజకవర్గం నుంచి వెళ్లిన భక్తులు జరిగిన విషయంపై విచారం వ్యక్తం చేస్తూనే అనేక అనుమానాలు లేవనెత్తారు. ఈ ఘటనలో లక్షిత తల్లిదండ్రులపై అనుమానంగా ఉందన్నారు. పోలీసులు వారిని లోతుగా దర్యాప్తు చేయాలనిసూచన చేశారు ప్రసన్న. ఇది ఆడపిల్లకు సంబంధించిన అంశమని అందుకే విచారణ జరగాలని డిమాండ్‌ చేశారు. చిన్నారి మృతిపై టీటీడీ ఛైర్మన్‌తో మాట్లాడినట్టు ప్రసన్న తెలిపారు. చాలా విచారం వ్యక్తం చేశారని.. ఈ దుర్ఘటనపై దర్యాప్తు చేయిస్తున్నట్టు కూడా చెప్పారని తెలిపారు. పేరెంట్స్‌ను కూడా విచారించాలని తాను చెప్పినట్టు పేర్కొన్నారు. బాలిక ఫ్యామిలీకి ఆర్థిక సాయం టీటీడీ చేయబోతుందని తెలిపారు ప్రసన్న.   రుయా ఆసుపత్రిలో పోస్టుమార్టం చేసిన తర్వాత లక్షిత డెడ్‌బాడీని నెల్లూరుజిల్లాలోని స్వస్థలానికి తరిలించారు. చెంగుచెంగున లేడి పిల్లలా ఎగురుతూ కళ్లెదుటే మెట్లు ఎక్కిన చిన్నారి ఇలా కనిపించే సరికి దినేశ్ ఫ్యామిలి షాక్ తింది. వారి రోధనలకు అంతులేకుండా పోయింది. తల్లిదండ్రులతో పాటు వచ్చిన కుటుంబ సభ్యులు ఏడుపు అక్కడి వారందరనీ కంట తడి పెట్టించింది.

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!