చిరుత సంచారం… ఒంటరిగా రాకండి

- Advertisement -

చిరుత సంచారం… ఒంటరిగా రాకండి

Cheetah Walk… Don't come alone

రాజామండ్రి
జిల్లా అటవీశాఖ అధికారి భరణి మీడియా సమావేశం నిర్వహించారు. రెండు రోజుల కిందట రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో  చిరుత పులి సంచరించిన  నేపథ్యంలో ప్రజలందరూ  సాయంత్రం ఆరు దాటాక  ఒంటరిగా బయటకు రావద్దని సూచించారు. ప్రతి ఒక్కరు టార్చ్ లైట్ తోనే బయటకు రండి.. ఆరు బయట ప్రదేశాల్లో కూర్చోవద్దు.  రాజమండ్రి నగరంలోని  స్వరూప్ నగర్, పద్మావతి నగర్, రూప నగర్, శ్రీ రామ్ నగర్, తారకరామానగర్, ఏపీ హౌసింగ్ బోర్డ్ కాలనీ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. తప్పకుండా ఈ ప్రదేశాల్లో చిరుత పులి ఉందని ధ్రువీకరించిన అధికారులు. చిరుత పులి బిహేవియర్ ను బట్టి  ఎన్ని రోజుల్లో పట్టుకోగలం అనేది ఇప్పుడే నిర్ధారించలేము. చిన్నపిల్లలను ట్యూషన్లకు చీకటి పడిన తర్వాత పంపవద్దు. ఇప్పటివరకు మనుషులపై ఎటువంటి దాడులు జరగలేదు. చిరుతపై సమాచారం ఉంటే వెంటనే తెలియజేయమని టోల్ ఫ్రీ నెంబర్   18004295909
తెలిపారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular