- Advertisement -
చేనేత ప్రదర్శనను ప్రారంభించిన ఆర్యవైశ్య కార్పోరేషన్ ఛైర్మన్
Cheneta is the Chairman of Arya Vaishya Corporation who started the show
హైదరాబాద్
శ్రీనగర్ కాలనీలోని శ్రీ సత్య సాయి నిగమాగమంలో ఏర్పాటైన జాతీయ చేనేత పట్టు వస్త్ర ప్రదర్శన తెలంగాణ ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత గుప్తా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారతీయ సంస్కృతి లో పట్టు , హ్యాండ్ లూమ్ వస్త్రో ఉత్పత్తులకు ఎంతో ప్రత్యేకత ఉందని ఈ ఉత్పత్తులకు నేటికి వన్నె తగ్గలెదన్నారు. చేనేత అమ్మ చల్లని ఒడిలా ఆమె అభివర్ణించారు. నేటి తరం యువతలో కూడా హ్యాండ్ లూమ్ ఉత్పత్తులను ఎంతో ఆదరిస్తున్నారన్నారు ప్రతి ఒక్కరూ చేనేత ను మరింత ఆదరించాలన్నారు. నిర్వాహకులు జయేష్ కుమార్ గుప్తా మాట్లాడుతూ, ఈ డిసెంబర్ 2వ తేది వరకు కొనసాగుతున్న ప్రదర్శన లో దేశం లోని 14 రాష్ట్రాల నుండి చేనేత కారులు , చేతి పని బృందాలు తమ సిల్క్ హ్యాండ్ లూమ్ చీరలు, డ్రెస్ మెటిరియల్ వంటి 75 వేల రకాల వస్త్రో ఉత్పత్తులను అందుబాటులొ ఉంచారని వివరించారు.
- Advertisement -