చర్లపల్లి రైల్వే టెర్మినల్ కు పొట్టి శ్రీరాములు పేరు
నేచర్ క్యూర్ హాస్పిటల్ కు రోశయ్య పేరు
సీఎం రేవంత్ రెడ్డి
Cherlapalli Railway Terminal named after Potti Sriramulu
Nature Cure Hospital named after Rosaiah
హైదరాబాద్
శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. రాజకీయాలు కలుషితమయ్యాయో…నాయకుల ఆలోచనలు కలుషితమయ్యాయో తెలియడం లేదు. పొట్టి శ్రీరాములు చేసిన కృషిని ఎవరూ తక్కువగా
చూడటంలేదు. వారి ప్రాణత్యాగాన్ని గుర్తించి అందరూ స్మరించుకోవాలి . పరిపాలనలో భాగంగా కొన్ని పాలనా పరమైన నిర్ణయాలు తీసుకున్నామని అన్నారు.
రాష్ట్ర ఏర్పాటుకు కృషి చేసిన వారిని స్మరించుకుని వారి పేర్లు పెట్టుకున్నాం . రాష్ట్ర పునర్విభజన తరువాత గత పదేళ్లుగా ఈ ప్రక్రియ కొనసాగుతోంది . కొన్ని వర్గాలకు కొందరు అపోహలు కలిగించే ప్రయత్నం చేస్తున్నారని
అన్నారు.
కేంద్ర పదవుల్లో ఉన్నవారు కూడా ఇలా చేయడం సమంజసం కాదు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి కాళోజీ పేరు పెట్టుకున్నాం. ఇది ఎన్టీఆర్ ను అగౌరవపరిచినట్టు కాదు. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ యూనివర్సిటీకి
ప్రొఫెసర్ జయశంకర్ పేరు పెట్టుకున్నాం. వైఎస్ పేరుతో ఉన్న హార్టికల్చర్ యూనివర్సిటీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టుకున్నాం. వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీకి పీవీ పేరును పెట్టుకున్నాం. ఇందులో
భాగంగానే పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాప్ రెడ్డి పేరు పెట్టుకున్నాం. ఏపీలో ఆ పాత పేర్లతో కొనసాగుతున్న యూనివర్సిటీలకు తెలంగాణలో పేర్లు మార్చుకున్నాం. ఒకే పేరుతో రెండు
యూనివర్సిటీలు ఉంటే పరిపాలనలో గందరగోళం ఉంటుంది. అందుకే తెలంగాణ రాష్ట్రంలోని యూనివ
ర్సిటీలకు, సంస్థలకు తెలంగాణ పేర్లు పెట్టుకుంటున్నాం. అంతే కానీ వ్యక్తులను అగౌరవపరిచేందుకు కాదు. విశాల
ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు… బాధ్యతాయుత పదవుల్లో ఉన్నవారు కులాన్ని ఆపాదిస్తున్నారు . కుల, మత ప్రాతిపదికన విభజించి రాజకీయ ప్రయోజనాలు పొందాలనుకుంటే అది
తప్పు . గుజరాత్ లో సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరుతో ఉన్న స్టేడియం పేరు తొలగించి ప్రధాని మోదీ పేరు పెట్టారు. మేం అలాంటి తప్పిదాలు చేయలేదు.. చేయం. చర్లపల్లి రైల్వే టెర్మినల్ కు పొట్టి శ్రీరాములు పేరు
పెట్టుకుందాం. చిత్తశుద్ధి ఉంటే కిషన్ రెడ్డి, బండి సంజయ్ కేంద్రం నుంచి అనుమతులు తీసుకురావాలి. బల్కంపేట నేచర్ క్యూర్ హాస్పిటల్ కు రోశయ్య పేరు పెట్టుకుందాం. రోశయ్య రి సేవలను కీర్తించుకునేలా అక్కడ
వారి విగ్రహాన్ని ఆవిష్కరించుకుందామని అన్నారు.



