లోన్ కోసం 40 వేల రూపాయిల చికెన్ లంచం

- Advertisement -

లోన్ కోసం 40 వేల రూపాయిల చికెన్ లంచం

Chicken worth 40 thousand rupees bribe for loan

రాయ్ పూర్, డిసెంబర్ 11 (వాయిస్ టుడే)
ఓ బ్యాంక్‌ మేనేజర్‌కు నాటు కోడి కూర అంటే మహా ఇష్టం. లోన్‌ ఇస్తానని నమ్మించి ఏకంగా రూ.39 వేల విలువ చేసే నాటు కోళ్లు తినేశాడు. ఆకలితో ఉన్న బకాసురుడి మాదిరి కోళ్లను నమిలేసిన ఆ బ్యాంకు మేనేజర్‌ని తీరా లోన్‌ గురించి అడగ్గా ప్లేట్ తిప్పేశాడు. దీంతో బాధితుడు లబోదిబోమంటూ నేరుగా పోలీసుల వద్దకు వెళ్లి అసలు విషయం చెప్పడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బిలాస్‌పూర్‌ జిల్లాలోని మస్తూరి పట్టణంలోరైతు రూపచంద్ మన్హర్‌కు కోళ్ల ఫారమ్‌ ఉంది. తన వ్యాపారాన్ని మరింత విస్తరించాలని భావించిన రైతు స్థానిక ఎస్‌బీఐ బ్రాంచ్‌ మేనేజర్‌ను కలిసి, రూ.12 లక్షల లోన్‌ అడిగాడు. లోన్‌ ఇస్తానని చెప్పిన మేనేజర్‌ తనకు నాటు కోడి కూర అంటే ఇష్టమని, తనకు నాటు కోడి తెచ్చివ్వాలని కోరాడు. లోన్ వస్తదన్న ఆశతో మన్హర్ బ్యాంకు మేనేజర్‌కి రోజూ నాటు కోడి మాంసం తెచ్చివ్వసాగాడు. అలా మొత్తం రూ.39 వేల విలువ చేసే నాటుకోళ్లు మేనేజర్‌ తినేశాడు. పైగా లోన్‌ కోసం 10 శాతం కమిషన్‌ కూడా చెల్లించాడు. లోన్‌ కావాలంటే ప్రతి శనివారం నాటు కోడి మాంసం కావాలని అడగటం, మరో చోట కోడిని కొని తీసుకురావడం రైతుకు దినచర్యగా మారిపోయింది.అయినా బ్యాంకు మేనేజర్‌ లోన్‌ మంజూరు చేయకుండా కాలయాపన చేస్తుండటంతో బ్యాంకు మేనేజర్‌ తనకు లోన్‌ ఇవ్వదల్చుకోలేదని భావించి, తనను మోసం చేశాడని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిందితుడిపై చర్యలు తీసుకోకపోతే తాను ఎస్‌బీఐ బ్రాంచ్ ముందే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. మేనేజర్‌కు ఇచ్చిన కోళ్ల తాలూకు బిల్లులు కూడా పోలీసులకు చూపాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular