జెండా, అజెండా భారత్…
విజయవాడ, ఆగస్టు 15
Chief Minister Nara Chandrababu Naidu
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియా వేదికగా భావోద్వేగ పోస్ట్ చేశారు. దేశ భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దడమే స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలకు ఇచ్చే నిజమైన నివాళి అని చంద్రబాబు తన పోస్ట్‌లో పేర్కొన్నారు.”ఎందరో మహనీయుల త్యాగాలు, పోరాటాల ఫలితమే మన స్వాతంత్ర్యం. దేశం నాకు ఏం చేసిందని కాకుండా, దేశానికి నేను ఏం చేయగలనని ప్రతి ఒక్కరూ ‘అనే నేను..’ సంకల్పంతో ఆలోచించాలి” అని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరి చేతిలో జాతీయ జెండా, గుండెల్లో దేశం కోసం బలమైన అజెండా ఉండాలని ఆయన ఆకాంక్షించారు.2047 నాటికి ‘వికసిత్ భారత్’, ‘స్వర్ణాంధ్ర’ సాధించాలన్న లక్ష్యంలో అందరూ భాగస్వాములు కావాలని చంద్రబాబు కోరారు. 0వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు. “ఎందరో మహనీయుల త్యాగాలు, పోరాటాల ఫలితమే మన స్వాతంత్ర్యం. వారి త్యాగాలకు నిజమైన నివాళి అంటే దేశ భవిష్యత్తును మరింత గొప్పగా నిర్మించడమే. అందుకు ‘అనే నేను…’ సంకల్పంతో దేశం నాకు ఏం చేసిందని కాదు… దేశానికి నేను ఏం చేయగలనని అందరూ ఆలోచించాలి. మన చేతిలో జాతీయ జెండా ఉండాలి… మన గుండెల్లో దేశం కోసం బలమైన అజెండా ఉండాలి. 2047 నాటికి వికసిత్ భారత్… స్వర్ణాంధ్ర సాకారం చేయాలన్న సమున్నత లక్ష్యంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి. 100 ఏళ్ల స్వాతంత్ర్య వేడుకల నాటికి దేశం, రాష్ట్రం స్వాతంత్ర్యం నుంచి సమృద్ధి వైపు… వికాసం నుంచి వైభవం వైపు ముందుకుసాగాలి. ఈ సంకల్పాన్ని నెరవేర్చుకునేందుకు ఐక్యంగా కలిసి అడుగులు వేద్దాం.” అని పిలుపునిచ్చారు. మన స్వాతంత్ర్య సమరయోధుల, దార్శనిక నాయకుల నుంచి శాశ్వతమైన స్ఫూర్తిని పొంది, వారి స్ఫూర్తిని దేశ నిర్మాణ కార్యంలో ముందుకు తీసుకువెళ్దాం. మన యువత స్పష్టమైన లక్ష్యంతో, నైతిక ధైర్యంతో నాయకత్వం వహించాలి. రాజకీయ విభజనలకు, సామాజిక విభేదాలకు అతీతంగా ఎదగాలి. ప్రతి పల్లెటూరు, పట్టణం, నగరంలోని ప్రతి పౌరుడు, రాబోయే తరాల కోసం బలమైన, సుసంపన్నమైన, స్వయం సమృద్ధిగల, నిజమైన వికసిత భారత్‌ను నిర్మించడానికి చిత్తశుద్ధితో తమ వంతు కృషి చేయాలి.” అని రాసుకొచ్చారు. ఇది మన సమిష్టి ధర్మం అని, ఇది మన ఉమ్మడి గమ్యం అని పేర్కొన్నారు. .”100 ఏళ్ల స్వాతంత్ర్య వేడుకల నాటికి దేశం, రాష్ట్రం స్వాతంత్ర్యం నుంచి సమృద్ధి వైపు, వికాసం నుంచి వైభవం వైపు సాగాలి. ఈ సంకల్పాన్ని నెరవేర్చుకోవడానికి ఐక్యంగా అడుగులు వేద్దాం” అని ఆయన తెలిపారు. తన సందేశాన్ని ‘జై తెలుగుతల్లి! జై హింద్!’ నినాదాలతో ముగించారు




