30.8 C
New York
Sunday, June 23, 2024

సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిపే నైతిక అర్హత లేదు; సీనియర్ జర్నలిస్టు పాశంయాదగిరి

- Advertisement -
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిపే నైతిక అర్హత లేదు; సీనియర్ జర్నలిస్టు పాశంయాదగిరి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిపే నైతిక అర్హత లేదని సీనియర్ జర్నలిస్టు పాశంయాదగిరి అన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉద్యమకారుల విషయంలో రేవంత్ వైఖరిని ఖండించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కోసం ఎందరో ఆత్మబలిదానాలు చేసుకున్నారని, తెలంగాణ కోసం నాటి కాంగ్రెస్ నేతలు ప్రస్తుత మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ ఎంపీ అంజన్ కుమార్, చిన్నారెడ్డి తదితరులు పోరాడారని, కాని రేవంత్ రెడ్డి ఒక్కసారి కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదన్నారు. తెలంగాణ బిల్లుపెట్టిన సోనియా గాంధీ, సుష్మా స్వరాజ్లు అంటేతమకు గౌరవం ఉందని, కాని రెండు కండ్ల సిద్ధాంతం పేరు చెప్పే నాయకుడికి సహచరుడినని చెప్పుకునే సీఎంకు ఆవిర్భావ వేడుకల విలువ తెలుసానని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి సర్కారు తెలంగాణ కోసం పోరాడిన వారిని అవమానిస్తున్నారని, ద్రోహం చేసిన వారిని సన్మానిస్తున్నారన్నారు. తెలంగాణ ఉద్యమకారులను కర్రలతో కొట్టిన నేటి ఖైరతాబాధ్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి దానం నాగేందర్, వందల ఎకరాల భూములను కబ్జా చేసిన రంజిత్ రెడ్డి, మైనంపల్లిలను తెచ్చిపెట్టుకోవడంతోనే రేవంత్ సర్కారు పనితీరు అర్ధమైందన్నారు. తెలంగాణ స్థూపం కట్టిన ఎక్కా యాదగిరి, సికింద్రాబాద్లోని క్లాక్ టవర్ వద్ద అమరుల సూపం కట్టిన సింహా పరిస్థితి దారుణంగా ఉందని, అలాంటి వారిని సన్మానించుకోవాలన్నారు. అందెశ్రీ రాసిన తెలంగాణ రాష్ట్ర గీతానికి ఆంధ్రా సంగీత దర్శకుడిని పెడుతున్నారని, ఉద్యమ ద్రోహులందరికీ టికెట్లు ఇచ్చారని, లోగోను మార్చేదుంటే చాకలి ఐలమ్మ బొమ్మ పెట్టాలని, ఓ కమిటీ వేయకుండా ఏకపక్ష నిర్ణయాలు ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమకారులకు మేలు చేయాలన్న చిత్తశుద్ది ఉంటే ముందుకు వారిపై ఉన్న కేసులన్నింటినీ ఎత్తివేయాలని, అందుకు ఓ కమిటీ వేయాలన్నారు. జూన్ 2వ తేదీలోగా అది చేయకుంటే ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించే బాధ్యతల నుంచి తప్పుకోవాలని, ఈ విషయాన్ని సోనియా గాంధీ దృష్టికి తీసుకువస్తానన్నారు. అమరుల కుటుంబాలకు న్యాయం జరుగకుండా ప్రొఫెసర్ కోదండ రాం ఎమ్మెల్సీ తీసుకుంటే ఆయనను సైతం విమర్శిస్తామన్నారు.08:29 PM

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!