- Advertisement -
పిల్లలపై తల్లిదండ్రుల నిరంతరం పర్యవేక్షణ వుండాలి
Children should be constantly supervised by parentsసికింద్రాబాద్
టెక్నాలజీని సరైన దిశలో ఉపయోగించుకునే విధంగా చూడడంతో పాటు మాదకద్రవ్యాల బారిన పడకుండా, పిల్లల కదలికలపై తల్లిదండ్రుల పర్యవేక్షణ ఎల్లప్పుడు ఉండాలని నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పవర్ తెలిపారు.
సికింద్రాబాద్ మహేంద్ర హిల్స్ లోని ఒక ప్రైవేట్ పాఠశాలలో జరిగిన వార్షిక దినోత్సవ వేడుకలకు ఐపీఎస్ శరత్ చంద్ర పవర్ ముఖ్య అతిథిగా హాజరై అత్యుత్తమ ప్రతిభ కనబరచిన చిన్నారులకు బహుమతులు అందించారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షించి ప్రశంసించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సరైన మార్గంలో టెక్నాలజీని ఉపయోగిస్తే కచ్చితంగా ఎదుగుదలకు తోడ్పడుతుందని, కానీ తప్పుడు దిశకు దారి తీయవచ్చు కాబట్టి ఎల్లప్పుడు పిల్లలతో మాట్లాడుతూ, పర్యవేక్షిస్తూ సరైన మార్గంలో ఉపయోగించే విదంగా మార్గదర్శకం చేయాలని, వారిలో ఆత్మవిశ్వాసం పెంచాలని తల్లిదండ్రులను కోరారు. రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్, మాదక ద్రవ్యాల పట్ల కఠినంగా ఉందని, వాటి బారిన పడకుండా తల్లిదండ్రులు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మన ఎదుగుదలలో స్నేహితుల ప్రభావం చాలా ఉంటుందని, స్నేహితుల ఎన్నికలో కూడా తెలివిగా ఉండాలని విద్యార్థులకు చెప్పారు.
- Advertisement -




