20 C
New York
Tuesday, May 28, 2024

Samsung Galaxy Z Flip 5 వంటి డిజైన్‌తో చైనీస్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్..

- Advertisement -

Samsung Galaxy Z Flip 5 వంటి డిజైన్‌తో చైనీస్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్..లాంచ్ ఎప్పుడంటే..?

చైనీస్ కంపెనీ Nubia ఈ ఏడాదిలో ప్రారంభంలో MWC 2024 సమయంలో తన ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ Nubia Flip 5Gని ప్రకటించింది. Nubia Flip 5G యొక్క రెండు వేరియంట్‌లు చైనాలో విడుదలైనవి. కానీ, భారత్ మార్కెట్లో మాత్రం ఈ ఫోన్ ఏప్రిల్ 16న అధికారికంగా
లభిస్తోంది. ఈ ఆర్టికల్ ద్వారా Nubia Flip 5G గురుంచి తెలుసుకుందాం.

స్పెసిఫికేషన్స్

Nubia Flip 5G స్మార్ట్‌ఫోన్ 6.9 అంగుళాల OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ఇది 1188 x 2790 పిక్సెల్‌లకు మద్దతు ఇస్తుంది. ఇది కాకుండా 1.43 అంగుళాల చిన్న సెకండరీ డిస్‌ప్లే కూడా ఇందులో అందించబడుతోంది. ఇది Qualcomm Snapdragon 7 Gen 1 ప్రాసెసర్‌లో పనిచేసే Nubia మొదటి ఫ్లిప్ స్మార్ట్‌ఫోన్. ఈ Nubia స్మార్ట్‌ఫోన్ Samsung Galaxy Z Flip 5 వంటి డిజైన్‌తో మార్కెట్లోకి వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ప్రధాన ఫోల్డబుల్ డిస్‌ప్లే 120Hz అధిక రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఇస్తుంది. ఈ ఫోన్ వెనుక భాగంలో రౌండ్ కెమెరా మాడ్యూల్ ఉంటుంది. ఇందులో రెండు కెమెరా సెన్సార్లు ఉన్నాయి. ఇది 50MP ప్రధాన కెమెరా మరియు సెకండరీ కెమెరాను కలిగి ఉంటుంది. సెల్ఫీ మరియు వీడియో కాలింగ్ కోసం ఇది 16MP కెమెరాను కలిగి ఉంది. Nubia Flip 5G 33W ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్‌తో 4,310mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.

ధర

Nubia Flip 5G ఫోన్ 8 GB RAM, 256 GB నిల్వ ఉన్న ఫోన్ ధర 2999 యువన్లు అంటే రూ.34,500. అయితే, 12 GB, 256 GB కలిగిన ఫ్లిప్ ఫోన్ ధర స్టోరేజ్ వేరియంట్‌లు 3699 యువన్లు అనగా రూ.42,500 గా ఉంది. దీనితో పాటు ఈ ఫ్లిప్ ఫోన్ మూడు రంగు ఎంపికలలో లభిస్తుంది. అవి కారామెల్, మిల్క్ టీ, టారో ఆప్షన్స్ లో లభిస్తోంది.

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!