కూతురు సుస్మిత పై చిరంజీవి ఎమోషనల్

- Advertisement -

కూతురు సుస్మిత పై చిరంజీవి ఎమోషనల్

Chiranjeevi Gets Emotional Over Daughter Sushmita
తన పెద్ద కుమార్తె, నిర్మాత సుస్మిత కొణిదెల పుట్టినరోజు సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికలో ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఒకప్పుడు తన వేలిని పట్టుకుని నడిచిన చిన్నారి, ఇప్పుడు బాధ్యతాయుతమైన మహిళగా ఎదిగిన తీరు తనకు గర్వంగా ఉందని ఆయన పేర్కొన్నారు. చిన్నప్పుడు తన సినిమాలు చూసిన కూతురు, ఇప్పుడు తన సినిమాకు నిర్మాతగా మారి బ్లాక్బస్టర్ అందించడం తండ్రిగా తనకు ఎంతో ప్రత్యేక క్షణమని తెలిపారు.చిన్నప్పుడు నా సినిమాలు చూసి ఎంజాయ్ చేసిన నువ్వు ఇప్పుడు నాతోనే సినిమా నిర్మించి మరిచిపోలేని బ్లాక్బస్టర్ అందించడం నాకు ఎంతో గర్వంగా అనిపించింది. నీ జీవితంలో ఎల్లప్పుడూ మంచి ఆరోగ్యం, ఆనందం, విజయాలు కలగాలని కోరుకుంటున్నాను. ఎప్పుడూ ఇలా వెలుగుతూ ముందుకు సాగు నా ప్రియమైన హనీ పాపా.. ఎప్పటికీ నా ప్రేమ, ఆశీర్వాదాలు నీతోనే ఉంటాయి’ అంటూ చిరంజీవి ఎమోషనల్గా ట్వీట్ చేశారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular