అవినీతి ఆరోపణలకు అడ్డాగా సివిల్ సప్లై శాఖ
నల్లగొండ
బీజేపీ ఎంపి బండి సంజయ్ శనివారం నాడునల్గోండ లో పర్యటించారు. బీజేపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి ను గెలిపించాలని విజ్ఞప్తి చేసారు.సంజయ్ మాట్లాడుతూ ప్రేమేందర్ రెడ్డి కి మొదటి ప్రాధన్యత ఓటు వేస్తామని అంటున్నారు. ఆరు గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ మోసం చేసింది. పార్లమెంటు ఎన్నికల్లోనూ మరోసారి మోసం చేయాల్ని చూసింది. మేము కాంగ్రెస్ మోసాలపై పొరాడుతున్నం.. అవసరమైతే జైళ్ళకైన పోతాం. వ్యవసాయాన్ని పూర్తిగా నాశనం చేసింది బీఆర్ఎస్ . కాంగ్రెస్ అదే దారిలో నడుస్తుంది. ధాన్యం కొనుగోళ్లలో.. కటింగ్ లేకుండా కొనట్లేదు. 500 బోనస్ అడ్రస్ లేదు. అవినీతి ఆరోపణలకు అడ్డాగా సివిల్ సప్లై శాఖా ఉంది. కాళేశ్వరం తర్వాత ఎక్కువ స్కామ్ ఇదె. సివిల్ సప్లై శాఖా నష్టాల్లో ఉండటానికి కారణమేంటి..? బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతే.. కాంగ్రెస్ లోనే నడుస్తున్ది. రైస్ మిల్లర్ల తో కుమ్మక్కై దోపిడీ పాల్పడుతున్నారు.అధికారంలోకి వచ్చి హడావుడి చేసి.. వేల కోట్లు వసూలు చేసి.. ఢిల్లీకి ముడుపులు పంపుతున్నారు.మిల్లర్ల అవినీతి విషయంలో.. కాంగ్రెస్ తీరు.. కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు ఉంది.ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద నాకు నమ్మకం ఉంది. మీరు సివిల్ సప్లై శాఖాపై దృష్టి పెట్టి.. అవినీతిని బైటకు తియ్యాలి. రైస్ మిల్లర్ నాయకుల నుంచి ఎవరెవరికి ఎంత వాటా ముట్టిందో బైట పెట్టాలి. రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే.. సివిల్ సప్లై శాఖా నష్టాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని డిమాండ్. లేదంటే.. మీరు లాలూచీ పడ్డట్టే.. నల్లగొండ జిల్లా ధాన్య భాండాగారం.. బీఆర్స్ కావాలనే పెండింగ్ ప్రాజెక్టులను పట్టించుకోలేదు. కృష్ణా జలాల విషయంలో.. జిల్లాను కేసీఆర్ మోసం చేశారు. బీఆర్ఎస్ అన్ని రంగాలను మోసం చేయగా.. కాంగ్రెస్ అదే పంథాను కొనసాగిస్తుంది. హిందూ ధర్మాన్ని, దేవుళ్ళను అవమానపర్చడం కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు ఫ్యాషన్ అయ్యింది. రాజ్యాంగానికి విరుద్ధంగా.. మతపరమైన రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్నమని అన్నారు.
అవినీతి ఆరోపణలకు అడ్డాగా సివిల్ సప్లై శాఖ:బీజేపీ ఎంపి బండి సంజయ్
- Advertisement -
- Advertisement -