Sunday, September 8, 2024

తాళిబొట్టులను కుదువబెట్టి  … డీడీలు కట్టి 

- Advertisement -

రెండో విడత గొర్రెల పంపిణీ వేగవంతం చేయాలి

యాదవులకు రెండో విడత గొర్రెల పంపిణీ చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దె దించుతాం.

సూర్యాపేట ,సెప్టెంబర్ 29(వాయిస్ టుడే జిల్లా ప్రతినిధి):  యాదవులకు రాష్ట్ర ప్రభుత్వం రెండో విడత గొర్రెల పంపిణీ చేయకపోతే రాబోయే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పి గద్దె దించుతామని గొర్రెల మేకల పెంపకం దారుల సంఘం (జిఎంపిఎస్) రాష్ట్ర సహాయ కార్యదర్శి బొల్లం అశోక్ జి ఎం పి ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి వీరబోయిన రవిలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు జిల్లాలో డీడీలు కట్టిన ప్రతి ఒక్కరికి రెండో విడత గొర్రెల పంపిణీ వేగవంతం చేయాలని జిఎంపిఎస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి కలెక్టరేట్ ఏవో సుదర్శన్ రెడ్డి కి వినతిపత్రం అందించడం జరిగింది. ఈ ధర్నాలో పాల్గొన్న వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రెండో విడత గొర్రెల  పంపిణీ చేస్తారని ఆశతో భార్యల మెడలోని తాళిబొట్టులను కుదువబెట్టి  అప్పు తెచ్చి ఇప్పటివరకు సూర్యాపేట జిల్లాలో 16900 మంది  లబ్ధిదారులు గొర్రెల కోసం డీడీలు కట్టి  నెలల తరబడి ఎదురు చూస్తున్న ప్రభుత్వం గొర్రెల పంపిణీ చేయకపోవడం దుర్మార్గం అన్నారు.ప్రభుత్వం  యాదవులకిచ్చిన హామీ లను నెరవేర్చాలని అన్నారు. ప్రభుత్వ యాదవులకు గొర్రెలు పంపిణీ చేస్తామని చెబితే అప్పులు తెచ్చి డీడీలు కట్టిన అప్పులకు వడ్డీలు కట్టలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనీ అన్నారు.గోర్లు పంపిణీ చేయడంలో మాత్రం అధికారులు నిర్లక్ష్యం వహించడం వల్ల గొర్రెలు వస్తాయో రావు అని యాదవులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. గొర్రెలు పంపిణీ చేయాలని ఎమ్మెల్యేలను కలవగా గ్రామంలో ఉన్న యాదవులు అందరూ బిఆర్ఎస్ కండువా కప్పుకోవాలని, బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తానని ప్రమాణం చేయాలని చెబుతున్నారని అన్నారు ప్రభుత్వం పంపిణీ చేస్తున్న గొర్రెల పంపిణీలో ఎమ్మెల్యేల మంత్రుల ప్రమేయం లేకుండా పంపిణీ చేయాలన్నారు గొర్రెల పంపిణీలో రాజకీయ జోక్యం లేకుండా డీడీలు కట్టిన ప్రతి ఒక్కరికి పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు

Clap your hands and tie the DDs
Clap your hands and tie the DDs

మున్సిపాలిటీ పరిధిలోని యాదవులందరికీ ఈ పథకాన్ని వర్తింపజేయాలని అన్నారు.నాసిరకమైన గొర్రెలను పంపిణీ చేయడం వల్ల పథకంలో లబ్ధి పొందిన లబ్ధిదారులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.గొర్రెల పంపిణీ చేసే కాంట్రాక్టర్లు పశు వైద్యాధికారులు కుమ్మక్కయి నాసిరకమైన గొర్రెలను పంపిణీ చేస్తూ లబ్ధిదారులను మోసం చేస్తున్నారని అన్నారు.కాబట్టి ప్రభుత్వం వెంటనే నాణ్యమైన గొర్రెలను పంపిణీ చేయాలని డిడి కట్టిన ప్రతి ఒక్కరికి ఈ పథకాన్ని వర్తింపజేయాలని లేనియెడల జిల్లాలోని యాదవులందరినీ సమీకరించి ఉద్యమాలు ఉదురుతో చేస్తామని హెచ్చరించారు.ఇంకా ఈ కార్యక్రమంలో జిఎంపిఎస్ జిల్లా జిల్లా అధ్యక్షులు కడెం లింగయ్య జిల్లా సహాయ కార్యదర్శి వచ్చే వినయ్ యాదవ్ జిల్లా ఉపాధ్యక్షులు కంచుగొట్ల శ్రీనివాస్ తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మట్టిపల్లి సైదులు నాయకులు కడియం లింగయ్య పిల్లి తిరుమలయ్య గుండాల లింగయ్య బోరాజ్ ఐలయ్య మన్యం లింగయ్య పచ్చిపాల వెంకన్న సుధాకర్ బోల్క నాగన్న గొర్ల నాగరాజు అంజయ్య లొడంగి సంజీవరావు మెంతబోయిన గంగయ్య సందయ్య నగిరి శ్రీశైలం బొరాజ్ ఎల్లయ్య నగిరి అన్వేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్