Saturday, December 28, 2024

ఇండియా కూటమి ఉమ్మడి మేనిఫెస్టోపై స్పష్టత..

- Advertisement -

ఇండియా కూటమి ఉమ్మడి మేనిఫెస్టోపై స్పష్టత..
న్యూఢిల్లీ జనవరి 10
ఈ ఏడాది ఏప్రిల్-మేలో జరుగనున్న లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా (I.N.D.I.A.) బ్లాక్ ఉమ్మడి మేనిఫెస్టో తో ప్రజల ముందుకు వెళ్తుందా? అనే ప్రశ్నకు ‘లేదనే’ మాట వినిపిస్తోంది. కూటమిలోని

భాగస్వామ్య పార్టీలకు సొంత మేనిఫెస్టోలు ఉంటాయని, అయితే ఉమ్మడి ఎజెండా మాత్రం ఉంటుందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. కూటమి భాగస్వామ్య పార్టీల మధ్య సీట్ల పంపకాలకు సంబంధించిన చర్చలు

ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి. అయితే, చర్చలు ఇంకా కొలిక్కి రావాల్సి ఉన్నాయి.
సీట్ల షేరింగ్‌పై చర్చల్లో భాగంగా మంగళవారంనాడు న్యూఢిల్లీలోని ముకుల్ వాస్నిక్ నివాసంలో మహారాష్ట్రకు చెందిన ‘మహా వికాస్ కూటమి’ భాగస్వాముల మధ్య చర్చలు జరిగాయి. చర్చలు ఫలప్రదంగా జరిగినట్టు

సమావేశానంతరం నేతలు తెలిపారు. సీట్ల షేరింగ్‌ కుదుర్చుకున్న తొలి రాష్ట్రం మహారాష్ట్రేనని నేతలు ప్రకటించారు. అయితే, మహా వికాస్ కూటమిలోని శివసేన (యూబీటీ), ఎన్‌సీపీ, కాంగ్రెస్ మధ్య ఏ రేషియోలో సీట్ల

పంపకాలకు అవగాహన కుదిరిందనేది అధికారికంగా నేతలు ఇంకా ప్రకటించలేదు. ఉద్ధవ్ థాకరే సారథ్యంలని శివసేన పెద్దన్న పాత్ర పోషించనుందని, ఎన్‌సీపీ, కాంగ్రెస్ కంటే ఎక్కువ సీట్లలో పోటీ చేయనుందని

విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఇండియా కూటమిలో కీలక పార్టీగా ఉన్న కాంగ్రెస్ మాత్రం విజయమే లక్ష్యంగా భాగస్వామ్య పార్టీలతో చర్చలు సాగిస్తోంది. ఎన్ని ఎక్కువ సీట్లలో పోటీ చేశామనే ధోరణిలో కాకుండా

అత్యధిక సీట్లలో గెలుపే లక్ష్యంగా ఆ పార్టీ అధిష్ఠానం వ్యూహరచన సాగిస్తోంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్