న్యూ ఇయర్ వేడుకల్లో బీఆర్ఎస్ , కాంగ్రెస్ నాయకుల మద్య ఘర్షణ,,,, వ్యక్తి మృతి
కామారెడ్డి జనవరి 1
: కామారెడ్డి జిల్లా నుసురాబాద్ మండలం, నాచుపల్లిలో న్యూ ఇయర్ వేడుకల్లో అపశ్రుతి చుతుచేసుకుంది.. న్యూ ఇయర్ వేడుకల్లో బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ నాయకుడిపై దాడి చేసిన సంఘటనలో కాంగ్రెస్ నేత
సాదుల రాములు మృతి చెందాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.నిన్న రాత్రి నాచుపల్లి గ్రామంలో యువకులు, వివిధ రాజకీయ పక్షాలకు చెందిన వారు న్యూ
ఇయర్ వేడుకలు జరుపుకున్నారు. పార్టీ చేసుకున్నారు. పన్నెండు – ఒంట గంట సమయంలో గ్రామంలో తిరుగుతున్నప్పుడు బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు ఎదురుపడ్డారు. గ్రామ కూడలి వద్ద ఇరు పక్షాల మధ్య
వాదోపవాదాలు జరిగి ఘర్షణకు దిగారు. ఈ ఘటనలో కాంగ్రెస్ నేత సాదుల రాములు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలో గ్రామంలో ఎలాంటి
అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.