- Advertisement -
టీటీడీలో ప్రక్షాళన ప్రారంభించాం…
Cleanliness has started in TTD...
భక్తుల మనోభీష్టం మేరకు అత్యుత్తమ సేవలందిస్తాం
-సీఎం నారా చంద్రబాబు నాయడు
రూ.13.40 కోట్లతో నిర్మించిన వకుళమాత వంటశాలను ప్రారంభించిన సీఎం
తిరుమల,
శ్రీవారి ప్రసాదం నాణ్యత విషయంలో రాజీపడబోమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. గతంలో ప్రసాదం బాగోలేదని చాలాసార్లు భక్తులు ఆందోళన చేస్తే నాటి పాలకులు పట్టించుకోలేదన్నారు. ప్రస్తుతం పూర్తి ప్రక్షాళన చేపట్టామని…భక్తుల అభిప్రాయాన్ని తీసుకుంటామన్నారు. తిరుమలలో రూ.13.40 కోట్లతో నిర్మించిన వకుళామాత వంటశాలను శనివారం సీఎం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ…. ‘‘వకుళా మాత కేంద్రీయ వంటశాలను ప్రారంభించడం ఆనందంగా ఉంది. 1.25 లక్షల మందికి అన్నప్రసాదాన్ని ఈ వంటశాల ద్వారా అందించవచ్చు. 18 వేల మందికి అరగంటలో ఒక రకం వంటకాన్ని ఈ కిచెన్ ద్వారా అందించవచ్చు. వెంగమాంబ, అక్షయ, వకుళమాత వంటశాలలతో 3 లక్షల మందికి అన్నప్రసాదం అందించవచ్చు. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు మెరుగైన సేవలందించేలా ఆధునిక కిచెన్ లు ఏర్పాటు చేశాం. శ్రీవారి ప్రసాదాల నాణ్యతలో రాజీపడం. ముడిసరుకుల నుండి ప్రసాదం బయటకు వచ్చేవరకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. వెంకటేశ్వరస్వామి లడ్డు ప్రపంచంలో ఎవరూ ఎక్కడా తయారు చేయలేకపోయారు…దీనికి పేటెంట్ కూడా ఉంది. పవిత్రమైన శ్రీవారి లడ్డు, జిలేబీ, మైసూర్ పాక్, వడకు ప్రత్యేకత ఉంది.’ అని అన్నారు.
- Advertisement -



