20 C
New York
Tuesday, May 28, 2024

సీఎం సవాల్ ను స్వీకరిస్తున్నా

- Advertisement -

సీఎం సవాల్ ను స్వీకరిస్తున్నా
హరీష్ రావు
సంగారెడ్డి
సంగారెడ్డి లో సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు ప్రెస్ మీట్ నిర్వహించారు.
హరీష్ రావు మాట్లాడుతూ సీఎం సవాల్ ని నేను స్వీకరిస్తున్నా. అధికార పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చే బాధ్యత ప్రతిపక్షంగా మాపై ఉంది. ఎల్లుండి అసెంబ్లీ ముందు అమరవీరుల స్తూపం వద్దకి నేను వస్తా. ఆగస్ట్ 15 లోపు మీరు ఇచ్చిన అన్ని గ్యారెంటీలు అమలు చేస్తానని ప్రమాణం చెయ్యమని అన్నారు.
ఆగస్ట్ 15 లోపు  పూర్తిగా రుణమాఫీ చెయ్యాలి. ఒకవేళ చేస్తే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా..మళ్ళీ ఉప ఎన్నికల్లో కూడా పోటీ చేయను. మీరు చెయ్యకపోతే సీఎం పదవికి రాజీనామా చేస్తారా. నాకు పదవి కంటే తెలంగాణ ప్రజల సంక్షేమమే ముఖ్యం. గతంలో కొడంగల్ లో ఓడిపోతే సన్యాసం తీసుకుంటానని చెప్పి తోక ముడిచి మాట తప్పిన వ్యక్తి రేవంత్ రెడ్డి. ఆరు గ్యారెంటిలను డిసెంబర్ 9నాడు అమలు చేస్తాం అని మాటతప్పింది కాంగ్రెస్ పార్టీ. ఆరు గ్యారెంటీలను చట్టబద్ధత చేస్తానని చెప్పి మాట తప్పారు. మాట తప్పడం పూటకో పార్టీ మారడం మీ నైజం. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చమంటే పార్టీ రద్దు చేసుకుంటావా అని తొండి మాటలు మాట్లాడుతున్నారు. అధికారంలోకి వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని సోనియాగాంధీ తల్లిగా లేఖ రాశారు. 120 రోజులు దాటినా నీ గ్యారెంటీలు ఏమయ్యాయి అని మేము అడుగుతున్ననని అన్నారు.
మహాలక్ష్మీ పథకంలో 2500 మహిళలకు ఎందుకు ఇవ్వలేదు. రైతులకు ఎకరానికి రైతు బంధు 15000 సహాయం ఇవ్వలేదు. ధాన్యానికి 500 బోనస్ ఏది..నిరుద్యోగులకు భృతి ఏదని ప్రశ్నించారు.

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!